మహేష్ కోసం దిగే నల్ల జాతీయుడు ఇతడేనా?
హాలీవుడ్ నటుడు డ్జిమోన్ గాస్టన్ హౌన్సౌ ఎంపిక చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
By: Tupaki Desk | 17 May 2025 4:00 AM IST# ఎస్ ఎస్ ఎంబీ 29 లో ప్రధాన ప్రతినాయకుడు ఎవరు? అన్నది ఇంతవరకూ క్లారిటీ లేదు. ఓ కీలక మైన పాత్ర ను పృద్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నాడు. అది ప్రతి నాయకుడి పాత్ర అని ప్రచారంలో ఉంది. కానీ మహేష్ సినిమాలో అతడే ప్రధాన విలన్ అని నిర్దారించడానికి లేదు. ఎందుకంటే? రాజమౌళి విలన్ పాత్రలను డిఫరెంట్ గా డిజైన్ చేస్తుంటాడు. ఎలాంటి ఇమేజ్ లేని నటుల్ని తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేయడం అన్నది అతడి ప్రత్యేకత.
అయితే ఎస్ ఎస్ ఎంబీ 29 గ్లోబల్ రీచ్ ఉన్న కంటెట్ కావడంతో విలన్ విషయంలో ఏకంగా ఓ నల్ల జాతీయుడినే రంగంలోకి దించుతున్నట్లు ఇప్పటికే బలమైన ప్రచారం ఉంది. ఆప్రికన్ అడవుల్లో సాగే థ్రిల్లర్ స్టోరీ కావడంతో నల్ల జాతీయుడు అయితే పర్పెక్ట్ గా సూటవుతాడని అతడినే ఎంపిక చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఆ ప్రచారాన్ని బలపరుస్తూ ఇప్పుడేకంగా ఓ నల్ల విలన్ తెరపైకి వచ్చాడు.
హాలీవుడ్ నటుడు డ్జిమోన్ గాస్టన్ హౌన్సౌ ఎంపిక చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల లండన్ వెళ్లిన రాజమౌళి అతడితో చర్చించినట్లు సమాచారం. ఇతడి పాత్ర ఆఫ్రికన్ హంటర్ గా తీర్చిదిద్దినట్లు సమాచారం. మహేష్ ని వెంటాడే విలన్ ఇతడేనని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో ఈ పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది. డ్జిమోన్ పై సెర్చింగ్ మొదలైంది. హాలీవుడ్ డ్జిమోన్ చాలా సినిమాలు చేసాడు. రెండు దశాబ్ధాలుగా సినిమాలు చేస్తున్నాడు.
' వితౌట్ యూ ఐయామ్ నథింగ్ 'సినిమాతో డ్జిమోన్ కెరీర్ మొదలైంది. అటుపై చాలా చిత్రాలు చేసాడు. 'గ్లాడియేటర్', 'ఫోరియన్స్ 7',' పాస్ ఆఫ్ ప్యూర్', 'రెబల్ మూన్' లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లోనూ నటిం చాడు. నటుడిగా అతడికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రస్తుతం హాలీవుడ్ ది మోన్ స్టార్, ది జీలోట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
