Begin typing your search above and press return to search.

రాజమౌళి సినిమా.. సూర్య తరహాలో మిస్ చేసుకోడు కదా?

టాలీవుడ్‌లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘SSMB29’ సినిమా భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   15 May 2025 3:45 PM IST
రాజమౌళి సినిమా.. సూర్య తరహాలో మిస్ చేసుకోడు కదా?
X

టాలీవుడ్‌లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘SSMB29’ సినిమా భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి గ్లోబల్ హిట్స్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లో జరుగుతుండగా, మహేష్ బాబు రగ్గడ్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయి ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా 2027లో రిలీజ్ కానుందని అంటున్నారు.

‘SSMB 29’ ఓ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథ, ఇండియానా జోన్స్ స్టైల్‌లో రియాలిటీ, మిథాలజీ, ఫిక్షన్‌ను మిక్స్ చేస్తూ సాగుతుందని సమాచారం. రాజమౌళి సినిమాలు అంటే భారీ సెట్స్, హై-ఓక్టేన్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నిండి ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించనున్నాడు, ఇది ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజమౌళి ఎప్పుడూ తన సినిమాల్లో భారీ కాస్టింగ్‌తో సంచలనం సృష్టిస్తాడు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంక ఈ సినిమా కోసం ఒడిశా షూటింగ్‌లో పాల్గొని, “కొరాపుట్‌లో గొప్ప ఆతిథ్యం చూశాను, ఇంకా ఎన్నో అడ్వెంచర్స్ కోసం ఎదురుచూస్తున్నా” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాలో విలన్ రోల్‌లో కనిపిస్తాడని టాక్. ఈ స్టార్ కాస్టింగ్ సినిమాకు గ్లోబల్ అప్పీల్‌ను తీసుకొస్తోంది.

తాజాగా ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. తమిళ స్టార్ చియాన్ విక్రమ్‌ను రాజమౌళి ఈ సినిమాలో ఓ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. విక్రమ్‌తో రాజమౌళి ఈ పాత్ర గురించి మాట్లాడారు, కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని ఓ సోర్స్ తెలిపింది. విక్రమ్ ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, ఈ సినిమాలో చేరితే మరింత బలం చేకూరుతుందని అంటున్నారు.

గతంలో రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్ర కోసం తమిళ నటుడు సూర్యను సంప్రదించాడు, కానీ సూర్య ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. ఆ పాత్ర తర్వాత సత్యరాజ్‌కు దక్కి, ‘బాహుబలి’లో కట్టప్ప పాత్ర ఐకానిక్‌గా మారింది. సూర్య ఆ పాత్రను అనవసరంగా మిస్ చేసుకున్నాడనే చర్చ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు రాజమౌళి విక్రమ్‌కు ఇచ్చిన ఆఫర్‌పై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.

ఇప్పుడు విక్రమ్ రాజమౌళి ఆఫర్ చేసిన ఈ క్యారెక్టర్‌కు ఒప్పుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. విక్రమ్ గతంలో ‘తంగలాన్’, ‘వీర ధీర సూరన్’ సినిమాలతో ఆకట్టుకున్నప్పటికీ, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాలో చేరడం విక్రమ్ కెరీర్‌కు బూస్ట్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.