SSMB29 అఫీషియల్ అప్ డేట్ అక్కడి నుంచే?
అయితే తాజాగా లండన్‌లో జరుగుతున్న కార్యక్రమంలో SSMB29కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 12 May 2025 9:28 AMRRR తరువాత వరల్డ్ వైడ్‌గా పాపులారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ప్రశంసలు కురిపించిన రాజమౌళి ప్రస్తుతం స్టార్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబుతో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఇండియన్ ఇండస్ట్రీ నుం,ఇ వస్తున్న భారీ హాలీవుడ్ రేంజ్ సినిమాగా దీన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్‌లతో పాటు హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు.
గత ప్రాజెక్ట్‌లకు పూర్తి భిన్నంగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల లీక్‌లు భయపెట్టినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఈ మూవీ షూటింగ్‌ని రాకెట్ స్పీడుతో లాగించేస్తున్నారు. `బాహుబలి` నుంచి తన సినిమాల షూటింగ్‌ల కోసం అత్యధిక వర్కింగ్ డేస్‌ని తీసుకుంటున్న రాజమౌళి ఈ మూవీ కోసం మాత్రం అలా చేయడం లేదు. రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. బ్రేక్ ఇస్తే మహేష్ ఎక్కడ ఆలస్యం చేస్తాడనే భయమో ఏమో కానీ రాజమౌళి మాత్రం మేకింగ్ విషయంలో స్పీడు పెంచారు.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్‌ని లాగించేస్తున్న జక్కన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఓ అప్ డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా లండన్‌లో జరుగుతున్న కార్యక్రమంలో SSMB29కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో `ఆర్ ఆర్ ఆర్` లైవ్ కాన్సర్ట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం రాజమౌళి, కీరవాణిలతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లండన్ వెళ్లారు.
అక్కడే మహేష్ బాబు SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించిన అదికారిక ప్రకటనని రాజమౌళి అనౌన్స్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీని కోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ప్రచారం జరుగుతున్నట్టే జక్కన్న లండన్ వేదికగా SSMB29 గురించి బిగ్ అప్‌డేట్‌ని ఇస్తారో లేక ఆశ పెట్టి ఉసూరుమనిపిస్తారో వేచి చూడాల్సిందే.