Begin typing your search above and press return to search.

SSMB29 : 'హిట్‌' స్టేజ్‌పై జక్కన్న హింట్‌ ఇస్తాడా?

ఆ సమయంలో అయినా రాజమౌళి పొడి పొడిగా అయినా స్పందిస్తాడని చాలా మంది నమ్మకంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   27 April 2025 5:50 AM
SSMB29 : హిట్‌ స్టేజ్‌పై  జక్కన్న హింట్‌ ఇస్తాడా?
X

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబోలో సినిమా రూపొందోతుంది. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. కానీ ఇప్పటి వరకు సినిమా గురించి చిన్న ప్రకటన కూడా రాలేదు. రాజమౌళి ఈ సినిమా గురించి షూటింగ్‌ ప్రారంభం అయింది అని కానీ మరే విషయాన్ని కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. మహేష్ బాబు పాస్‌ పోర్ట్‌ను సీజ్‌ చేసినట్లు చిన్న వీడియోను షేర్‌ చేశాడు. అంతకు మించి ఒక్క అక్షరం కూడా సినిమా గురించి చెప్పలేదు. సాధారణంగా రాజమౌళి తన సినిమా షూటింగ్‌ ప్రారంభం సమయంలోనే కథ గురించి, ఇతర విషయాల గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం.

రాజమౌళి ఎప్పుడెప్పుడు మీడియా ముందుకు వస్తాడు, ఎప్పుడు ఎప్పుడు జనాల్లోకి వస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమధ్య కాలంలో జనాల మధ్యకు రాని రాజమౌళి ఎట్టకేలకు హిట్‌ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం రాబోతున్నాడు. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హిట్‌ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి ముఖ్య అతిథిగా టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి రాబోతున్నాడు. ఆ విషయాన్ని అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. హిట్‌ 3 సినిమా ప్రీ రిలీజ్ వేడుక అయినప్పటికీ కచ్చితంగా రాజమౌళి చిన్న విషయం అయిన SSMB29 గురించి చెప్పే అవకాశం ఉందని మహేష్ బాబు అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

హిట్‌ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాబోతున్న వారిలో కొందరు అయినా మహేష్ బాబు అభిమానులు ఉంటారు. వారు SSMB29 సినిమా గురించి అప్‌డేట్‌ అడుగుతూ మొత్తుకోవడం మనం చూడబోతున్నాం. ఆ సమయంలో అయినా రాజమౌళి పొడి పొడిగా అయినా స్పందిస్తాడని చాలా మంది నమ్మకంగా ఉన్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటనకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. ఆ మీడియా సమావేశం ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని అయినా రాజమౌళి హిట్‌ 3 సినిమా ప్రీ రిలీజ్ వేడుక వేదికపై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

నానితో ఉన్న అనుబంధంతో రాజమౌళి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు అవుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హిట్‌ 3 సినిమాను రాజమౌళి చూశారని, ఆయనే స్వయంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించారని పుకార్లు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. హిట్‌ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు రాజమౌళికి చాలా ఇష్టం అని, అందుకే ఆయన హిట్‌ 3 పై ఆసక్తి కనబర్చుతున్నారని కూడా ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి రాజమౌళి హిట్‌ 3 ప్రీ రిలీజ్ వేడుకలో నాని గురించి ఏం మాట్లాడుతాడు, SSMB29 సినిమా గురించి ఏం మాట్లాడుతాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.