Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి ఇంత ఫాస్టా?

రాజ‌మౌళి సినిమా అంటే ఎంత లేట్ గా తెర‌కెక్కుతుందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2025 5:13 AM
Rajamouli Speed on SSMB29
X

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న త‌ర్వాతి సినిమాను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. ప్రతీసారి సినిమాకు ముందుగానే ప్రెస్‌మీట్ పెట్టి మూవీని అనౌన్స్ చేసి, క‌థా నేప‌థ్యం, నటీన‌టుల వివ‌రాలు తెలియ‌చేసే రాజ‌మౌళి ఈ సారి క‌నీసం అనౌన్స్‌మెంట్ కూడా లేకుండానే సినిమాను మొద‌లుపెట్టాడు.

ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని ఇప్ప‌టికే రాజ‌మౌళితో పాటూ సినిమాకు క‌థ అందించిన అత‌ని తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా వెల్ల‌డించారు. పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై అంద‌రికీ తారా స్థాయిలో అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా రాజ‌మౌళి ఎస్ఎస్ఎంబీ29ను తెర‌కెక్కిస్తున్నాడు.

రాజ‌మౌళి సినిమా అంటే ఎంత లేట్ గా తెర‌కెక్కుతుందో తెలిసిందే. ప్ర‌తీ స‌న్నివేశం చాలా ప‌ర్ఫెక్ట్ గా ఉండాల‌ని కోరుకునే రాజమౌళి తాను అనుకున్న‌ట్టు సీన్ వ‌చ్చేవ‌ర‌కు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ‌కుండా సినిమాను తెర‌కెక్కిస్తుంటాడ‌నే విష‌యం తెలిసిందే. అందుకే సినిమా లేట‌వుతుంది. ఎంత లేటైనా దానికి త‌గ్గట్టు అవుట్‌పుట్ ను ఇచ్చి అంద‌రినీ ఆక‌ట్టుకుంటాడు రాజ‌మౌళి.

కానీ రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా త్వ‌ర‌గా పూర్తి చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌హేష్ తో సినిమాను మొద‌లుపెట్ట‌డానికి జక్క‌న్న లేటైతే చేశాడు కానీ ఆ లేట్ ను క‌వ‌ర్ చేయ‌డానికి షూటింగ్ ను చాలా త్వ‌ర‌గా పూర్తి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పై మ‌రో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఎస్ఎస్ఎంబీ29 మూడో షెడ్యూల్ ఆల్రెడీ మొద‌లైంద‌ని, ఈ కొత్త షెడ్యూల్ లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఎవ‌రికీ తెలియ‌కుండా చాలా సైలెంట్ గా మ‌హేష్ సినిమాను జ‌క్క‌న్న పూర్తి చేస్తున్నాడు. జ‌క్క‌న్న ఇంత వేగంగా షూటింగ్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా బ‌హుశా ఇదేనేమో.