రాజమౌళి ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయలేదని ఫీల్ అయ్యాడా...
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రాజమౌళి ఉత్సాహాన్ని చూపించినప్పటికి అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు.
By: Tupaki Desk | 20 Sept 2026 5:00 PM IST'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాతో డైరెక్టర్ గా తన కెరీయర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ మూవీ తో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత చేసిన సింహాద్రి, సై సినిమాలతో ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఆ తర్వాత వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ వచ్చాడు. అలాంటి రాజమౌళి సై సినిమా చేసిన తర్వాత ఆ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికి ప్రొడ్యూసర్ ఆవుల గిరికి పెద్ద మొత్తంలో డబ్బులు రాలేదు. దాంతో ఆయన బ్యానర్ లోనే మరో సినిమా చేస్తానని రాజమౌళి కమిట్ మెంట్ ఇచ్చాడట. దానికి ఆవుల గిరి సైతం రజనీకాంత్ తో మనం సినిమా చేద్దామని రజనీకాంత్ డేట్స్ కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఈలోపు విజయేంద్ర ప్రసాద్ రజినీకాంత్ ఇమేజ్ కి సరిపడా కథలు కూడా సిద్ధం చేసి పెట్టడంతో రాజమౌళి సైతం రజనీకాంత్ ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించాలని అనుకున్నాడు. కానీ అప్పుడు రజనీకాంత్ బిజీగా ఉండడంవల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇక చత్రపతి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి రాజమౌళి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాడు. విజయేంద్రప్రసాద్ సైతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని కథలను రెడీ చేశాడు.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రాజమౌళి ఉత్సాహాన్ని చూపించినప్పటికి అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా రాజమౌళితో సినిమాకి కమిటైన హీరో ఆ మూవీ పూర్తయ్యేంత వరకు వేరే సినిమాకి కమిట్ అవ్వకుండా ఆ ఒక్క మూవీ మీదనే ఉండాలి. ఆయన సినిమా కోసం ఎక్కువ డేట్స్ ను కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడే పవన్ కళ్యాణ్ 3 సినిమాలకు కమిట్ అయ్యాడు. కాబట్టి రాజమౌళి తో సినిమా చేస్తే తను కమిటైన సినిమాలను క్యాన్సిల్ చేయాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ రాజమౌళికి నో చెప్పాడట.
మొత్తానికైతే తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని డైరెక్ట్ చేయాల్సిన అవకాశాన్ని రాజమౌళి కోల్పోయాడు. కెరియర్ స్టార్టింగ్ లో వీళ్ళిద్దరితో సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారట. కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. అందువల్లే రాజమౌళికి ఈ విషయం గుర్తుకొచ్చిన ప్రతిసారి కొంతవరకు బాధపడుతుంటాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే రాజమౌళి ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను టార్గెట్ గా పెట్టుకొని సినిమాలు చేస్తున్నాడు.
బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో గొప్ప ఇమేజ్ ను తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' సినిమాతో మరో మెట్టు పైకెక్కాలని చూస్తున్నాడు. ఈ సినిమా మీద హాలీవుడ్లో సైతం మంచి అంచనాలు ఉన్నాయంటే ఆయన ఏ రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు... ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు సైతం మన సినిమాలను పట్టించుకునేవారు కాదు. కానీ 'బాహుబలి' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపింపజేసిన రాజమౌళి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవల్లో నిల్చోబెట్టాడు. ఇక ప్రస్తుతం వారణాసి సినిమాతో హాలీవుడ్లో సైతం పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు...
