తారక్ వల్లే నా పని సులువైంది
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ హీరోలకు రాజమౌళి పెట్టే ప్రెజర్ మామూలుగా ఉండదు.
By: Tupaki Desk | 17 April 2025 3:12 PM ISTదర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ హీరోలకు రాజమౌళి పెట్టే ప్రెజర్ మామూలుగా ఉండదు. ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే రాజమౌళి ఏ మాత్రం కాంప్రమైజ్ అవకుండా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. అందుకే తన సినిమాలకు నేషనల్ లెవెల్ లో గుర్తింపు వస్తుంటుంది. రాజమౌళి గత సినిమా ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్ లో ఆడిందో, ఎన్ని సంచలనాలు సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే డాక్యుమెంటరీ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ డాక్యుమెంటరీకి కూడా ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ డాక్యుమెంటరీని జపాన్ లో రిలీజ్ చేయాలని భావించింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే డాక్యుమెంటరీ జపాన్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఆ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన రాజమౌళి, అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించాడు. ఇంటరాక్షన్ లో భాగంగా రాజమౌళి, ఆర్ఆర్ఆర్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. కొమురం భీముడో సాంగ్ ను ప్రస్తావిస్తూ ఆ సాంగ్ షూటింగ్ టైమ్ లో జరిగిన ఎక్స్‌పీరియెన్స్‌ను జక్కన్న షేర్ చేసుకున్నాడు.
కొమురం భీముడో లాంటి సాంగ్ ను తాను ఈజీగా షూట్ చేయగలిగానంటే దానికి కారణం ఎన్టీఆరేనని, ఎన్టీఆర్ చాలా గొప్ప యాక్టర్ అని, మరీ ముఖ్యంగా ఆ పాటలో ఎన్టీఆర్ శరీరంలోని ప్రతీ భాగం నటించిందని, తాను కేవలం ఎన్టీఆర్ ఫేస్ పై కెమెరా పెట్టి సాంగ్ ను మాత్రమే ప్లే చేశానని, మిగిలిందంతా ఎన్టీఆరే చేశాడని రాజమౌళి ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో పొగిడాడు.
ఆ సాంగ్ అంత బాగా రావడానికి కారణం ఎన్టీఆర్ తో పాటూ కొరియోగ్రాఫర్ కూడా అని, తారక్ ను ఎలా కట్టాలి? ఎలా కదిలించాలనే అంశాలపై చాలా స్టడీ చేసి, ఎంతో ప్లాన్డ్ గా చేశాడని రాజమౌళి తెలిపాడు. ఇదిలా ఉంటే వ్యక్తిగతంగా రాజమౌళి, ఎన్టీఆర్ కు అభిమాని అనే విషయం తెలిసిందే. తాను చాలా కంఫర్ట్ గా వర్క్ చేసే హీరోల్లో ఎన్టీఆర్ ఫస్ట్ ఉంటాడని జక్కన్న ఇప్పటికే చాలా సార్లు చెప్పగా ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ను ప్రశంసించి అతనిపై తన అభిమానాన్ని బయటపెట్టాడు రాజమౌళి.
