Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌కు పోటీగానే వాళ్లంతా!

'బాహుబ‌లి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి చిత్రాల‌తో రాజమౌళి పాన్ ఇండియాలో ఓ బ్రాండ్ గా మారారు.

By:  Srikanth Kontham   |   28 Aug 2025 12:00 AM IST
జ‌క్క‌న్న‌కు పోటీగానే వాళ్లంతా!
X

'బాహుబ‌లి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి చిత్రాల‌తో రాజమౌళి పాన్ ఇండియాలో ఓ బ్రాండ్ గా మారారు. ఇప్పుడు ఏ డైరెక్ట‌ర్ పాన్ ఇండియా సినిమా తీసినా? రాజ‌మౌళి స్పూర్తితోనే అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. రాజ‌మౌళితోనే సినిమాలు చేయ‌డానికి దేశంలో ఉన్న టాప్ స్టార్లే క్యూలో ఉన్నారు. అంత‌కు మించి రాజ‌మౌ ళి గ్రేట్ అని చెప్ప‌డానికి మ‌రో స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేదు. రాజ‌మౌళి త‌ర్వాత సుకుమార్, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, ప్ర‌శాంత్ నీల్, చందు మొండేటి, సందీప్ రెడ్డి వంగా ఇలా చాలా మంది ద‌ర్శ‌కులు పాన్ ఇండియా సినిమాలు తీసారు.

బాహుబ‌లిని మించిన చిత్రాలు:

స‌క్సెస్ లు అందుకున్నారు. వాళ్ల‌లో స్పూర్తి నింపింది ఎవ‌రు? అంటే అంతా గంటా ప‌థంగా చెప్పే పేరు రాజ‌మౌళి. మేము కూడా మీ రూట్లోనే అంటూ జ‌క్క‌న్న ను కీర్తించిన వారెంతో మంది. తాజాగా ఈ నయా డైరెక్ట‌ర్లు అంతా రాజ‌మౌళికి పోటీగా రెడీ అవుతున్నారు? అన్న‌ది అంతే వాస్త‌వం. భ‌విష్య‌త్ లో గ‌ట్టి పోటీ నిచ్చేది కూడా వాళ్లే. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో నితీష్ తీవారీ `రామాయ‌ణం` తెర‌కెక్కిస్తున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న‌చిత్ర‌మిది. భారీ వార్ స‌న్నివేశాల‌తో బాహుబ‌లిని మించిన‌ సినిమా అవుతంద‌ని అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఎవ‌రూ త‌గ్గేదేలే:

నితీష్ గ్రేట్ మేకింగ్ తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. బాహుబ‌లి కి ఈసినిమా మంచి పోటీని స్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌తంలోనూ ఇతి హాసాల మీద కొన్నిసినిమ‌లొచ్చినా? తాజా `రామాయణం`పై బ‌జ్ మాత్రం దేశ వ్యాప్తంగా భారీగా ఉంది. హిందుత్వం కాన్సెప్ట్ జ‌నాల్లోకి బ‌లంగా వెళ్ల‌డం కీల‌కంగా మారింది. అలాగే బ‌న్నీతో అట్లీ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని కూడా జ‌క్క‌న్న‌కు పోటీగా పోలిక చేస్తున్నారు. ఇది భారీ టెక్నిక‌ల్ స్టాండ‌ర్స్డ్ ఉన్న‌చిత్రం కావ‌డంతో ఈ రేసులో నిలిచింది.

ప‌ట్టాలెక్కించని వాళ్లు కూడా:

ప్ర‌ఖ్యాత హాలీవుడ్ స్టూడియోల‌ను రంగంలోకి దించ‌డం..బ‌న్నీ పాత్ర‌కు సంబంధించిన లుక్ టెస్ట్ వంటి అంశాలు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. దీంతో ఈ చిత్రాన్ని అట్లీ ఎలా తీస్తాడు? అన్న‌టెన్ష‌న్ ఓ సెక్ష‌న్లో బ‌లంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్`, నాగ వంశీ `క‌ల్కి 2` వంటి చిత్రాలు ఎస్ ఎస్ ఎబీ 29కి ధీటుగా ఉంటాయి? అన్న విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.