Begin typing your search above and press return to search.

హిట్3 ఈవెంట్ లో జ‌క్క‌న్న డ్రీమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించి ఆ ఈవెంట్ కు గెస్టుగా రాజ‌మౌళిని తీసుకొచ్చాడు. దీంతో ఆ ఈవెంట్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.

By:  Tupaki Desk   |   28 April 2025 5:37 AM
Rajamouli On Dream Project
X

ఇప్పుడు ఎక్క‌డ చూసినా నాని హీరోగా తెర‌కెక్కిన హిట్3 సినిమా గురించే. దానిక్కార‌ణం నాని ఆ సినిమాకు ఆ రేంజ్ లో ప్ర‌మోష‌న్స్ ను నిర్వ‌హించ‌డ‌మే. మే 1న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం నాని తిర‌గ‌ని సిటీ లేదు. చేయ‌ని ప్రమోష‌న్ లేదు. ఎప్ప‌టికంటే భిన్నంగా ఈసారి ప్ర‌మోష‌న్స్ ను కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేసి అంద‌రినీ ఎట్రాక్ట్ చేశాడు నాని.

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించి ఆ ఈవెంట్ కు గెస్టుగా రాజ‌మౌళిని తీసుకొచ్చాడు. దీంతో ఆ ఈవెంట్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అయితే ఈవెంట్ లో భాగంగా యాంక‌ర్ సుమ స‌ర‌దాగా స్టేజ్ పై ఇంట‌రాగేష‌న్ లాగా చేసి అంద‌రి నుంచి ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను రాబ‌ట్టుకుంది. అందులో భాగంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని కూడా సుమ ఓ ప్ర‌శ్న అడిగింది.

మీరు తీయ‌బోయే మ‌హాభార‌తంలో నాని గారి క్యారెక్ట‌ర్ ఫిక్స్ అయిపోయింద‌ని విన్నాం. నిజమేనా అని సుమ అడగ్గా దానికి రాజ‌మౌళి స్పందిస్తూ త‌న డ్రీమ్ ప్రాజెక్టులో నాని ఉంటాడ‌నేది మాత్రం ఫిక్స్ అని వెల్ల‌డించాడు. దీంతో అక్క‌డి ప్రాంగ‌ణం మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. ఇదిలా ఉంటే రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాత‌గా మ‌హాభార‌తం సినిమాను అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

త్వ‌ర‌లోనే త‌న నిర్మాణంలో మ‌హాభారత క‌థ ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నాన‌ని, ఐదు భాగాలుగా రానున్న ఈ సినిమాకు ప‌లువురు డైరెక్ట‌ర్లు ప‌ని చేయ‌నున్నార‌ని, ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లేలా స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఆల్రెడీ అమీర్ ఖాన్ చేస్తున్నాడు కాబ‌ట్టి రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభార‌తం ను తీసే ఆలోచన‌ను విర‌మించుకుంటాడేమో అని అంద‌రూ అనుమాన‌ప‌డ్డారు.

అంద‌రి అనుమానాల‌కు బ్రేక్ వేస్తూ రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్టు క‌చ్ఛితంగా ఉండి తీరుతుంద‌ని హిట్3 వేదిక‌గా, అంద‌రిముందు క‌న్ఫ‌ర్మ్ చేశాడు. అంతేకాదు అందులో ఓ క్యారెక్ట‌ర్ ను నానితో చేయిస్తాన‌ని కూడా రాజ‌మౌళి మాటిచ్చాడు. రాజ‌మౌళికి మ‌హాభార‌తం చేసే ఆలోచ‌న లేక‌పోతే ఆ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చెప్ప‌కుండా త‌ప్పించుకునేవాడు. కానీ సుమ అడ‌గ్గానే క్ష‌ణం కూడా ఆలోచించుకోకుండా స‌మాధాన‌మిచ్చాడంటే జ‌క్క‌న్న నుంచి మ‌హాభార‌తం రావ‌డం ఖాయమే. నానితో పాటూ ప‌లువురు స్టార్ హీరోలు కూడా రాజ‌మౌళి డ్రీమ్ ప్రాజెక్టు లో భాగ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.