రాజమౌళిని డిస్ట్రబ్ చేయకూడదని వాళ్లకి తెలుసు..!
సెట్స్ మీద ఉన్న స్టార్ హీరో సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉంటారు. ఆ సినిమా నుంచి వచ్చే ప్రమోషన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
By: Tupaki Desk | 17 July 2025 9:44 PM ISTసెట్స్ మీద ఉన్న స్టార్ హీరో సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉంటారు. ఆ సినిమా నుంచి వచ్చే ప్రమోషన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇదివరకు అప్డేట్ కోసం వెయిట్ చేసే వాళ్లు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చే సరికి డైరెక్ట్ గా ఆ మూవీ నిర్మాతలకు, డైరెక్టర్ కి ట్యాగ్ చేసి మరీ అప్డేట్స్ అడుగుతున్నారు. స్టార్ సినిమా షూటింగ్ టెన్షన్ ఒక పక్కైతే.. ఫ్యాన్స్ చేసే అప్డేట్స్ గోల మరోపక్క డైరెక్టర్స్ ని డిస్ట్రబ్ చేస్తుంది.
ఐతే అందరి దర్శకులను తమ అభిమాన నటుడి సినిమా అప్డేట్ కోసం టార్గెట్ చేస్తుంటారు. కానీ ఒక్క రాజమౌళిని మాత్రం ఈ విషయంలో వదిలేస్తున్నారు. అలా ఎందుకు అంటే రాజమౌళి సినిమా అంటే కర్త కర్మ క్రియ అన్నీ తానై ఉంటాడు. తన సినిమా ఫస్ట్ ఫ్రేం నుంచి ఎండ్ టైటిల్స్ వరకు ఎవరు కాంప్రమైజ్ అయినా కాకపోయినా రాజమౌళి అవ్వడు. స్టార్ ఫ్యాన్స్ కి కూడా సినిమా అప్డేట్ కోసం రాజమౌళిని అడగక్కర్లేదని అనుకుంటారు.
ఎందుకంటే రాజమౌళి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి రిలీజ్ వరకు ప్రమోషనల్ యాక్టివిటీస్ ని కూడా తన సినిమా మేకింగ్ లో భాగంగానే ప్లాన్ చేస్తాడు. బాహుబలి సినిమా నార్త్ లో అంత బాగా ప్రభావం చూపించింది అంటే ఆ సినిమాకు రాజమౌళి ఫాలో అయిన ప్రమోషనల్ యాక్టివిటీస్ అని చెప్పాల్సిందే.
అందుకే రాజమౌళి సినిమా చేస్తున్న స్టార్ ఫ్యాన్స్ కూడా ఆయన ఎప్పుడు సినిమా అప్డేట్ ఇస్తారా అని ఎదురుచూస్తారు తప్ప రివర్స్ ఎటాక్ కి దిగరు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎక్కడ చెప్పలేదు. ఐతే ఓ పక్క షూటింగ్ మాత్రం స్పీడ్ గా జరుగుతుంది. ఈమధ్యలో రాజమౌళి చాలా సినిమా ఈవెంట్స్ కి వస్తున్నాడు. కానీ ఎస్.ఎస్.ఎం.బి 29 ప్రాజెక్ట్ గురించి మాత్రం చెప్పట్లేదు.
అక్కడకు వచ్చిన ఫ్యాన్స్ కూడా రాజమౌళి ఏదైనా అప్డేట్ ఇస్తే విందామని తప్ప.. ఆయన్ను అప్డేట్ కోసం విసిగిద్దాం అన్న ఆలోచన లేదు. సో రాజమౌళి డిస్ట్రబ్ చేయకూడదు అన్న ఆలోచన మాత్రం ప్రతి స్టార్ ఫ్యాన్ కి ఉంది. ఆ నమ్మకమే స్టార్స్ కి రాజమౌళి లెక్కకు మించి సక్సెస్ ఇచ్చేందుకు కారణం అవుతుందని చెప్పొచ్చు.
