రాజమౌళి దృష్టిలో పడ్డాడంటే..?
అంతేకాదు రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ లో నాని తప్పనిసరిగా ఉంటాడు అనే సరికి నాని కూడా హమ్మయ్య మన సీటు కన్ఫర్మ్ అనేసుకుని ఉంటాడు.
By: Tupaki Desk | 29 April 2025 12:02 AM ISTరాజమౌళి ఏ స్టార్ తో సినిమా చేసినా ముందు అది రాజమౌళి సినిమా ఆ తర్వాతే ఆ సినిమాకు ఆ స్టార్ ఇమేజ్ యాడ్ అవుతుందని చెబుతుంటారు. అఫ్కోర్స్ ఆ విషయంలో హీరో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయినా రాజమౌళితో చేసె సినిమాల వల్ల ఏర్పడే రికార్డులను ఆలోచించి జక్కన్నకే ముందు క్రెడిట్ ఇస్తారు స్టార్ ఫ్యాన్స్. తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లడానికి ఒక దారి వేసి చూపించాడు. అదే దారిలో ఇంకొన్ని అద్భుతాలు చేస్తూ వస్తున్నారు మిగతా దర్శకులు.
అలాంటి రాజమౌళి దృష్టిలో పడటం అంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా తను ఊహించిన దాని కన్నా ఎక్కువ ముందుకెళ్లాడు అని న్యాచురల్ స్టార్ నాని గురించి చెప్పడం నాని సాధించిన సక్సెస్ ల కన్నా ఎక్కువ కిక్ ఇస్తుంది. ఏదో సినిమా ఈవెంట్ కి పిలిచారు కాబట్టి పొగిడే మాటలు కొన్ని ఉంటాయి. అవి అందరికీ తెలుస్తాయి. కానీ నాని హిట్ 3 ఈవెంట్ లో రాజమౌళి నాని గురించి మాట్లాడిన మాటలు అన్నీ నాని కష్టానికి దక్కాల్సినవే అనిపించాయి.
అంతేకాదు రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ లో నాని తప్పనిసరిగా ఉంటాడు అనే సరికి నాని కూడా హమ్మయ్య మన సీటు కన్ఫర్మ్ అనేసుకుని ఉంటాడు. రాజమౌళి డైరెక్షన్ లో నాని ఈగ సినిమా చేశాడు. ఆ సినిమాలో నాని ఫస్ట్ హాఫ్ వరకే ఉండి ఆ తర్వాత ఈగగా మరో జన్మ తీసుకుంటాడు. ఐతే మహాభారతం సినిమా తర్వాత కానీ నానికి ఇప్పుడున్న ఇమేజ్ తో రాజమౌళి ఒక సోలో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే ఏమో ఏమైనా జరగొచ్చు అని అంటున్నారు.
ఎందుకంటే నాని గురించి రాజమౌళి ఊహించిన దానికన్నా అన్నాడు అంటే తప్పకుండా ఏదైనా కథ అది నానితో చేసే వర్క్ అవుట్ అవుతుంది అనుకుంటే మాత్రం రాజమౌళి చేస్తాడు. నాని కూడా రాజమౌళితో మరో సోలో అంటే ఈసారి ఈగ, దోమ అన్నట్టు కాకుండా తన ఫుల్ పొటెన్షియల్ చూపించే సినిమా ఏదైనా వస్తే చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. నాని సినిమా పట్ల చూపించే ప్రేమ.. గెలుపు కోసం పడే కష్టానికి తప్పకుండా ఇలాంటి ఒక గొప్ప అవకాశం రావాలని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినీ అభిమాని కూడా కోరుకుంటాడు.
