Begin typing your search above and press return to search.

మహేష్‌ లేకుండా... మేడం డాన్స్‌ రిహార్సల్స్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్‌ బాబు హీరోగా సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   25 Jun 2025 12:21 PM IST
మహేష్‌ లేకుండా... మేడం డాన్స్‌ రిహార్సల్స్‌
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్‌ బాబు హీరోగా సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. గత నెల రోజులు సమ్మర్‌ హాలీడేస్ తీసుకున్న యూనిట్‌ సభ్యులు తిరిగి షూటింగ్‌ ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేష్ బాబు ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమా గురించి జక్కన్న నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. అయినా కూడా మీడియాలో మాత్రం సినిమా గురించి ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుత షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటుందని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

ఆ వార్తలను బలపరుస్తూ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో మహేష్ బాబు లేకుండా ఒంటరిగా డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుంది. ఆ విషయాన్ని కొరియోగ్రాఫర్‌ విక్కీ భార్తియా షేర్‌ చేశాడు. హైదరాబాద్‌లో ప్రియాంక చోప్రాతో డాన్స్‌ ప్రాక్టీస్ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకతో దిగిన ఫోటోలను కూడా విక్కీ షేర్‌ చేయడం జరిగింది. అంతే కాకుండా హైదరాబాద్‌ను లొకేషన్‌గా ట్యాగ్‌ చేయడం జరిగింది. దాంతో మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా కోసమే ప్రియాంక ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తేలిపోయింది. హైదరాబాద్‌లో జరగబోతున్న కొత్త షెడ్యూల్‌లో మహేష్‌బాబు, ప్రియాంక చోప్రాలపై పాటను దర్శకుడు రాజమౌళి చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రియాంక చోప్రా గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో విక్కీ భార్తియా స్పందిస్తూ... ప్రియాంక చోప్రా మేడం తో పని చేస్తున్నాను. ఆమెతో వర్క్ చేయడం అనేది ప్రత్యేకమైన అనుభవం. ఆమె చాలా తెలివైనది, ఫన్నీ, బలమైనది. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో చాలా ఆప్యాయంగా ఉంటుంది. డాన్స్ రిహార్సల్స్, షూట్ సమయంలో ఆమె శక్తి నిజంగా స్ఫూర్తిదాయకం, నాకు ప్రత్యేకంగా కనిపించేది ఏమిటంటే, ఆమె ప్రతి ఒక్కరికీ, వారి పాత్ర తో సంబంధం లేకుండా గౌరవం ఇస్తుంది. ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది. ఇప్పటికీ తన చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. నాకు ఆమె పట్ల చాలా ప్రేమ మరియు గౌరవం ఉంది. ప్రియాంక మేడమ్, ప్రేరణ కు మరియు మీ కళ పట్ల చాలా దయగా, వాస్తవంగా మరియు మక్కువ చూపినందుకు ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో చిన్న భాగం అయినందుకు నిజంగా కృతజ్ఞుడను అంటూ పోస్ట్‌ చేశాడు.

టాలీవుడ్‌లో మొదటి సారి ప్రియాంక చోప్రా నటించబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఉంది. బాలీవుడ్‌లోనూ ప్రియాంక చోప్రా కనిపించి చాలా కాలం అయింది. ఆమె ఇండస్ట్రీలో కనిపించకున్నా ఆమె సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉండటం ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంది. హాలీవుడ్‌కే పరిమితం అయింది అనుకుంటున్న సమయంలో రాజమౌళి, మహేష్‌ బాబు సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. మహేష్‌ బాబు కు ప్రియాంక సరి జోడీ అంటూ అభిమానులు మొదటి నుంచి అంటూ వస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా మరో విజయాన్ని ఆమెకు కట్టబెట్టడం ఖాయం.