Begin typing your search above and press return to search.

మహేష్ తర్వాత రాజమౌళి హీరో ఎవరు..?

అందుకే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా కూడా తప్పకుండా ఉంటుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   12 May 2025 7:30 PM
మహేష్ తర్వాత రాజమౌళి హీరో ఎవరు..?
X

RRR తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఐతే మహేష్ తో సినిమాను అనుకున్న విధంగా రెండేళ్లలో పూర్తి చేయాలని చూస్తున్నాడు జక్కన్న.

మహేష్ కూడా సినిమాకు కావాల్సిన డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం 2027 లో ఈ మూవీ రిలీజ్ చేసే ప్లానింగ్ ఉందట. ఐతే రాజమౌళి సినిమా అది కూడా మహేష్ తో సో సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది చెప్పడం కష్టం. ఇక మరోపక్క రాజమౌళి మహేష్ సినిమా తర్వాత ఏ హీరోతో చేస్తాడన్న డిస్కషన్ కూడా మొదలైంది. రాజమౌళి హీరోల లిస్ట్ లో ఎన్ టీ ఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ తో ఆల్రెడీ 3 సినిమాలు చేశాడు జక్కన్న. మళ్లీ తారక్ తో మరో సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడట. మహేష్ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ లైన్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు బాహుబలి ప్రభాస్ తో కూడా రాజమౌళి మరో ప్రాజెక్ట్ ని అనుకుంటున్నాడట. ఈ ఇద్దరితోనే కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా రాజమౌళి సినిమా ప్లానింగ్ ఉందన్న టాక్ నడుస్తుంది. మిగతా వారంతా కూడా రాజమౌళి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటే అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ తో కలిసి చేసిన పుష్ప తో పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

అందుకే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా కూడా తప్పకుండా ఉంటుందని తెలుస్తుంది. ఇక వీరే కాకుండా రాజమౌళి లిస్ట్ లో మరికొంతమంది తమిళ స్టార్స్ కూడా ఉన్నట్టు టాక్. సూర్యతో రాజమౌళి ఎప్పుడో సినిమా చేయాలని అనుకోగా అది కాస్త మిస్ అయ్యింది. మళ్లీ జక్కన్న ఛాన్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు సూర్య. ఇక రాజమౌళి మహాభారతం అంటూ చేస్తే అందులో మన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా భాగమయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రాజమౌళి సినిమా అందులోనూ మహాభారతం అంటే తప్పకుండా తెలుగు పరిశ్రమ అంతా సపోర్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారని చెప్పొచ్చు.