జక్కన్న మూవీ.. మహేష్ 63వ వారసుడా?
అయితే ఇప్పుడు మహేష్ బాబు, జక్కన్న మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 10 Aug 2025 10:51 AM ISTదర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచర్స్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా జక్కన్న ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హ్యాష్ ట్యాగ్ ఫుల్ గా ట్రెండ్ అవుతోంది.
జక్కన్న ఇచ్చిన గ్లోబ్ ట్రాటర్ ట్యాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ప్రపంచాన్ని చుట్టేసే అద్భుతమైన సాహసికుడి కథతో సినిమా రూపొందుతున్నట్లు చెప్పకనే చెప్పినట్లు ఉన్నారు. విభూది నామాలు, త్రిశూలం, ఢమరుకం, నందీశ్వరుడు, రుద్రాక్షతో ప్రత్యేకంగా తయారు చేసిన మాలకు సినిమాలో ప్రాధాన్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అయితే ఇప్పుడు మహేష్ బాబు, జక్కన్న మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల క్రితం గరుడ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఇప్పుడు Gen 63గా టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. సినిమాలో మహేష్ బాబు ఒక కుటుంబంలోని 63వ తరం పాత్రను పోషిస్తున్నారని వినికిడి.
అరుదైన, శక్తివంతమైన వస్తువుల కోసం ఆయన చేసే అన్వేషణ చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. సైన్స్ ఫిక్షన్ అంశాలతో కథ రామాయణం నుంచి ప్రేరణ పొందిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే షూటింగ్ ఇప్పటికే 30 శాతం కంప్లీట్ అయిందట.
ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన టాంజానియాలో చిత్రీకరణ కొత్త షెడ్యూల్ ను జక్కన్న ప్రారంభించనున్నారని సమాచారం. దాదాపు ఒక నెలపాటు అక్కడే షూటింగ్ నిర్వహించనున్నారని వినికిడి. భారీ ఫారెస్ట్ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. మహేష్ పై కీలక సన్నివేశాలు టాంజానియా అటవీ ప్రాంతంలో తీయనున్నారని టాక్.
అయితే తొలుత కెన్యాలో షూటింగ్ నిర్వహించాలని మేకర్స్ అనుకున్నారు! కానీ అక్కడ పరిస్థితులు బాగోలేక రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఫిక్స్ చేశారట. అది కూడా కాదనుకుని ఇప్పుడు టాంజానియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్ ను వేయగా, అక్కడ షూట్ చేయనున్నారని సమాచారం. 2026 మధ్యలో షూటింగ్ ముగించనున్నారని వినికిడి.
