ఖైరతాబాద్‌కి రాజమౌళి... మహేష్ సినిమా కారణమా?
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 24 April 2025 5:20 PM ISTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయిన విషయం తెల్సిందే. ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిపిన రాజమౌళి షూటింగ్‌కి కనీసం రెండేళ్ల సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే రాజమౌళి ఈ సినిమా ను ఎక్కువ శాతం విదేశాల్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో నిర్వహించగా మరో షెడ్యూల్ ఒడిశా లో నిర్వహించిన విషయం తెల్సిందే. తదుపరి షెడ్యూల్ కోసం రాజమౌళి అండ్ టీం ఆఫ్రికా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
రాజమౌళి హఠాత్తుగా ఖైరతాబాద్‌లోని ఆర్‌టీఏ ఆఫీస్‌లో ప్రత్యక్షం అయ్యారు. లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన ఆఫీస్‌ని సందర్శించారని తెలుస్తోంది. ఆయనకు ఇప్పటికే లైసెన్స్ ఉన్నప్పటికీ అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఆఫీస్‌కి వచ్చారని అధికారులు తెలియజేశారు. ఆయనతో డిజిటల్ సైన్ తీసుకుని, ఫోటో దించి లైసెన్స్ ను రిన్యువల్ చేశామని అధికారులు తెలియజేశారు. మహేష్ బాబు సినిమాను అత్యధికంగా విదేశాల్లో షూట్ చేయబోతున్నారు. ఆ సమయంలో అంతర్జాతీయ లైసెన్స్ అవసరం ఉంటుంది. అందుకే రాజమౌళి ప్రత్యేకంగా లైసెన్స్‌ను తీసుకుని ఉంటారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి గతంలోనూ ఖైరతాబాద్ ఆర్‌టీఏ ఆఫీస్‌కు వెళ్లారు. ఈసారి మాత్రం అంతర్జాతీయ లైసెన్స్‌కి వెళ్లారు.
మహేష్ బాబుకు సంబంధించిన లుక్ ఇటీవల లీక్ కావడంతో అంచనాలు పెరిగాయి. మహేష్ బాబు లుక్ ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో లేకుండా చేశారు. అయినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు ఆ ఫోటోలను షేర్ చేశారు. మహేష్ బాబు సినిమా అంటే హీరోలను ఓ రేంజ్‌లో చూపిస్తాడు. కనుక మహేష్ బాబును సైతం అదే స్థాయిలో ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో మూవీ బాహుబలి కంటే ముందు రూపొందాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కింది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏడాదికి పైగా ఖాళీగా ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా నిరాశ పరిచింది. మహేష్ బాబు 2023 డిసెంబర్ నుంచి షూటింగ్స్‌కి దూరం అయ్యాడు. ఎట్టకేలకు ఇటీవలే రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ గ్యాప్ లో రాజమౌళి సలహాతో జుట్టు పెంచడంతో పాటు, గడ్డం పెంచాడు. మహేష్ బాబు ఫైనల్‌గా ఏ లుక్‌ను ఖరారు చేశారు అనేది ఆసక్తిగా మారింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించబోతుంది. పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
