హీరోల విషయంలో వాళ్లిద్దరు జగమొండి!
లేదంటే హీరో బిజీ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే మొదలు పెడదామని మరో ఆప్షన్ ఇవ్వగా అందుకు రెడీ అయినట్లు సమాచారం.
By: Tupaki Desk | 24 May 2025 3:00 AM ISTఒక హీరోతో రాజమౌళి సినిమా పట్టాలెక్కించారంటే? ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆ హీరో మరో సినిమాకు కమిట్ అవ్వడానికి ఉండదు. ఇది రాజమౌళి సినిమాలకు సంబంధించి హీరోలకు విధించే రూల్. జక్కన్న సినిమా అంటే గ్లోబల్ రేంజ్ కాబట్టి ఈ నిబంధన తప్పని సరి. సినిమా పూర్తయ్యే వరకూ హీరో ఎలాంటి డిస్టబెన్స్ కి గురి కాకూడదు. పూర్తిగా రాజమౌళి కి బాండ్ అయి పని చేయాల్సి ఉంటుంది.
అలాగైతేనే రాజమౌళి తో పనిచేసే అవకాశం. ఇందులో ఎలాంటి మార్పు లుండవ్. అవసరం మేర రేయింబవళ్లు అందుబాటులో ఉండాలి. ఆన్ సెట్స్ లోనే కాపురం కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆ విష యంలో రాజమౌళి జగమొండి. ప్రభాస్, రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్ అలా పని చేసిన హీరోలే. ప్రస్తుతం పనిచేస్తోన్న మహేష్ కూడా అంతే బాండ్ అయి పనిచేస్తున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా కూడా రాజమౌళి స్ట్రాటజీనే అనుసరిస్తున్నాడు.
ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇక నుంచి మరో లెక్క అంటూ హీరోలకు సందీప్ కండీషన్లు పెడుతున్నాడు. ప్రభాస్ తో 'స్పిరిట్' చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతోన్న క్రమంలో? సెట్స్ కు వెళ్తే మాత్రం కేవలం తన సినిమాకు మాత్రమే పని చేయాలనే కండీషన్ ప్రభాస్ కు పెట్టాడుట. షూటింగ్ మొదలైన నాటి నుంచి ముగించే వరకూ 'స్పిరిట్' ఆలోచనలు తప్ప మరో సినిమా ఆలోచన లేకుండా ఉంటేనే? సెట్స్ కు వెళ్దాం అన్నారుట.
లేదంటే హీరో బిజీ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే మొదలు పెడదామని మరో ఆప్షన్ ఇవ్వగా అందుకు రెడీ అయినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ 'పౌజీ', 'రాజాసాబ్' సినిమాలు చేస్తున్నాడు. ఏక కాలంలో వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు పూర్తి చేయడానికి ఏడాదంతా సరిపోతుంది. ఈ క్రమంలోనే 'స్పిరిట్ ను వచ్చే ఏడాది వరకూ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది.
