Begin typing your search above and press return to search.

రాజమౌళి ఫస్ట్ శాలరీ ఎంత? ఏం వర్క్ చేశారు?

దర్శకధీరుడు రాజమౌళి.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్ అనే చెప్పాలి.. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 7:39 AM
రాజమౌళి ఫస్ట్ శాలరీ ఎంత? ఏం వర్క్ చేశారు?
X

దర్శకధీరుడు రాజమౌళి.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్ అనే చెప్పాలి.. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా అలరించారు. వేరే లెవెల్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సత్తా చాటారు. ఓ బ్రాండ్ గా మారారు.

ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు దక్కేలా చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ సినిమా రూపొందిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో టాలీవుడ్ కు మరింత గుర్తింపు లభించే విధంగా ఆ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు.

అయితే రాజమౌళి రెమ్యునరేషన్ సినిమాకు దాదాపు 50 కోట్లకు పైనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. మూవీకి వచ్చిన లాభాల్లో కూడా ప్రాఫిట్స్ అందుకుంటారని కూడా చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా రాజమౌళి.. తన మొదటి రెమ్యూనరేషన్ గురించి చెప్పి షాకిచ్చారు.

రీసెంట్ గా ఆయన.. కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సమయంలో రాజమౌళితో యాంకర్ సుమ చిట్ చాట్ నిర్వహించారు. అప్పుడు మీ తొలి సంపాదన ఎంత? అని అడగ్గా, అసిస్టెంట్‌ ఎడిటర్‌ గా పని చేసిన సమయంలో తొలిసారిగా రూ.50 అందుకున్నానని తెలిపారు. దాంతో ఏం చేశారని సుమ అడిగారు.

అయితే ఆ డబ్బుతో ఏం చేశానో తనకు గుర్తులేదంటూ సమాధానమిచ్చారు. వెంటనే సుమ ఆ టైమ్ లో రమా గారు మీ దగ్గర లేరు కదా.. ఆ డబ్బు మాత్రం ఆవిడకి ఇచ్చి ఉండరులేండి అని సెటైర్ వేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారగా, రాజమౌళి ఫస్ట్ రెమ్యూనరేషన్ 50 రూపాయలు అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

అదే సమయంలో ఇండస్ట్రీలో ప్రేమ విషయంలో కుబేరులు ఎవరని అడగ్గా. .సుమను ఉద్దేశించి రాజమౌళి నువ్వేనని అన్నారు. ప్రతి ఈవెంట్‌ లో అందరినీ సొంతవారిలా భావిస్తావని చెప్పారు. ప్రేమగా మాట్లాడాతావని కొనియాడారు. అందుకే సుమను కుబేరిణి అనాలో ఇంకేమనాలో తెలియట్లేదని నవ్వుతూ అన్నారు. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు.