రాజమౌళి మహాభారతం: ముగ్గురు స్టార్ హీరోలు ఫిక్స్!
మహాభారతం నిర్మాణం మొదలైతే కొంతమంది స్టార్ హీరోల్ని తాను ఎప్పటికీ మిస్ చేయదలుచుకోలేదని జక్కన్న చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
By: Tupaki Desk | 28 April 2025 6:52 AMపాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న ప్రాజెక్టు. అలాంటి సినిమా చేయాలి అంటే తనకున్న అనుభవం సరిపోదని బాహుబలి కంటే ముందే చెప్పాడు. ఇక బాహుబలి అనంతరం తన డ్రీమ్ ప్రాజెక్టు అని చాలాసార్లు చెప్పాడు. ఒకటి రెండు భాగాలుగా కాకుండా ఒక నాలుగైదు బాగాలుగా ఆ ప్రాజెక్టు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలియజేశాడు. ఇక రీసెంట్ ఆయన మాటల్లోనే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
మహాభారతం నిర్మాణం మొదలైతే కొంతమంది స్టార్ హీరోల్ని తాను ఎప్పటికీ మిస్ చేయదలుచుకోలేదని జక్కన్న చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే మూడు కీలక పాత్రలకు హీరోలను లాక్ చేసినట్టే కనిపిస్తోంది. రీసెంట్ గా హిట్ 3లో నాని ఫిక్స్ అని చెప్పడంతో ముగ్గురు ఫిక్స్ అయ్యారని ఫ్యాన్స్ కు కూడా క్లారిటీ వచ్చేసింది.
రాజమౌళి గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో ఓ మాట స్పష్టంగా చెప్పారు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం తాను జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంచుకుంటానని. ఎన్టీఆర్ వంటి వక్త, నటనా ప్రతిభ ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుడి గంభీరత్వాన్ని, చమత్కారాన్ని సమర్థంగా చూపించగలడు అని రాజమౌళి అభిప్రాయం. తన కలలో కూడా ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడిగా చూపించుకోవడం చాలా రోజుల కల అని పేర్కొన్నారు.
అలాగే, మరో ఇంటర్వ్యూలో రాజమౌళి మహాభారతంలో కర్ణుడి పాత్ర గురించి మాట్లాడారు. కర్ణుడు పాత్రకు అత్యద్భుతమైన ఏమోషన్, గంభీరత అవసరం. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని, అతడి పరిపక్వత, విభిన్నమైన శైలి ఈ పాత్రను చిరస్మరణీయంగా మార్చగలదని చెప్పారు. కర్ణుడిగా ప్రభాస్‌ని చూడాలని తన కోరికను కూడా జక్కన్న వెల్లడించారు.
ఇటీవల హిట్ 3 ఈవెంట్లో రాజమౌళి మరో లీక్ వదిలారు. మహాభారతం తెరకెక్కిస్తే నాని ఖచ్చితంగా భాగమవుతారని స్పష్టం చేశారు. ఈ విషయం నాని ఫ్యాన్స్‌ను ఆనందంతో ఊపేసింది. నానిలో ఉన్న నేచురల్ యాక్టింగ్, పాత్రల మీద పట్టును గుర్తించి రాజమౌళి ఇలా చెప్పడం విశేషం. నానిని మహాభారతంలో ఏ పాత్రకు అనుకుంటున్నారో మాత్రం ఇంకా బయటపెట్టలేదు.
ఈ లెక్కన రాజమౌళి మహాభారతం రూపు దిద్దుకుంటే శ్రీకృష్ణుడిగా జూనియర్ ఎన్టీఆర్, కర్ణుడిగా ప్రభాస్, మరో పాత్రలో నాని.. ఫిక్స్ అయినట్టే. ఇది సరిగ్గా కార్యరూపం దాలిస్తే, ఇండియన్ సినిమా చరిత్రలోనే గొప్ప ఎపిక్ గా నిలిచే అవకాశం ఉంది. మిగతా పాత్రలకూ టాలీవుడ్ నుంచి సూపర్ కాస్టింగ్ వచ్చే అవకాశం పక్కా. ఇకపోతే రాజమౌళి మహాభారతం కోసం ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకున్నా, ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్టు తో బిజీగా ఉన్న జక్కన్న ఆ తరువాత ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.