రాజమౌళి బాలీవుడ్ హీరోలకు ఛాన్స్ ఇవ్వడా?
దర్శకశిఖరం రాజమౌళి కొంత కాలంగా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 1:00 AM ISTదర్శకశిఖరం రాజమౌళి కొంత కాలంగా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తోన్న సంగతి తెలిసిందే. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` ఇప్పటికే హిట్లు. తాజాగా చేస్తోన్న `ఎస్ ఎస్ ఎంబీ 29` ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమాల్లో హీరోల సంగతి పక్కనబెడితే? విలన్లు...కీలక పాత్రలకు ఎంపికైంది మాత్రం కేవలం సౌత్ నటులు మాత్రమే. `బాహుబలి`లో విలన్ భల్లాల దేవ రానా అయితే... కాలకేయ ప్రభాకర్...కన్నడ నటుడు సందీప్, తమిళ నటుడు సత్యారాజ్ లు కీలక పాత్రలు పోషించారు.
ఇంకా సినిమా మొత్తంగా చూసుకుంటే? సౌత్ కమ్ తెలుగు వారే కనిపించారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన `ఆర్ ఆర్ ఆర్` లో సౌత్ తో పాటు బ్రిటన్ నటులు కనిపించారు. ఆ కథకు బ్రిటన్ పాత్ర ధారులైతేనే సూటవుతారని ప్రత్యేకంగా ఇండియాకి రప్పించి రంగంలోకి దించారు. ప్రస్తుతం చేస్తోన్న ఎస్ ఎస్ ఎంబీ 29 లోనూ అంతే . ఇందులోనూ కన్నడ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విలన్ విషయానికి వస్తే ఆఫ్రికా ఖండానికి చెందిన ఓ నల్ల జాతీయుడ్ని రంగంలోకి దించుతున్నట్లు వార్త లొస్తున్నాయి.
ఇలా విలన్ల విషయంలో సౌత్ నటులు అవసరం అనుకుంటే దేశం దాటి పోతున్నారు తప్ప! రాజమౌళి ఎందుకని బాలీవుడ్ నటుల్ని తీసుకోవడం లేదు. ఆయన పాన్ ఇండియా సినిమాలో ఇంతవరకూ ఒక్క బాలీవుడ్ నటుడు లేడు. ఆయన పిలవాలేగానీ స్టార్ హీరోలే నటించడానికి క్యూలో నుంచుంటారు. అమీర్ ఖాన్ లాంటి నటుడైతే తనకు ఓ అవకాశం ఇవ్వాలని పబ్లిక్ గానే అడిగారు. ఇంకా రాజమౌళి సినిమాలో నటించాలని ఎంతో మంది హిందీ స్టార్లు ఆశపడుతున్నారు.
హీరో పాత్ర కాకపోయినా కీలక పాత్ర అయి నా..గెస్ట్ రోల్ అయినా చేయడానికి సిద్దంగా ఉన్నారు. కానీ జక్కన్న మాత్రం వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక. అయితే ఏ పాత్రకైనా సూటైతే ఎలాంటి తారతమ్యం లేకుండా తీసుకుంటాం అన్నది రాజమౌళి ఎప్పుడు బలంగా చెప్పే మాట. అందులో ఎలాంటి సందేహం లేదు. బహుశా రాజమౌళి కథలు హిందీ నటుల్ని డిమాండ్ చేయడం లేదేమో.
