రవితేజతో ఆ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఉందా లేదా..?
అనిల్ రావిపూడి మాస్ మహరాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
By: Tupaki Desk | 3 Jun 2025 8:15 AM ISTఅనిల్ రావిపూడి మాస్ మహరాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రవితేజ బ్లైండ్ రోల్ లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. రవితేజ ఎనర్జీకి అనిల్ రావిపూడి మార్క్ డైరెక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమా అంతా కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది. ఐతే రాజా ది గ్రేట్ ఎండింగ్ లో పార్ట్ 2 ఉంటుందన్న హింట్ ఇచ్చారు. ఇప్పటికే ఎఫ్2 సీక్వెల్ గా ఎఫ్3 చేశాడు. అదే పాత్రలతో మరో కథను నడిపించారు.
ఏం చేసినా ఎలా చేసినా అనిల్ రావిపూడి సినిమా అంటే ఆడియన్స్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. అందుకు తగినట్టుగానే ఫలితాలు ఉంటున్నాయి. ఐతే రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేశాక మరో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. రాజా డబుల్ గ్రేట్ అంటూ రాజా ది గ్రేట్ తరహా కథనే రాయాలని ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
అనిల్ రావిపూడి సినిమా అంటే స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఎందుకంటే అతను కెరీర్ లో తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. మెగా 157 సినిమా పూర్తయ్యాక మరో స్టార్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుంది.
రవితేజతో అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది కానీ కాస్త టైం పట్టేలా ఉంది. రాజా డబుల్ గ్రేట్ కథ పూర్తైతే మాత్రం రవితేజ కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెబుతాడని చెప్పొచ్చు. ప్రస్తుతం రవితేజ కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరి రాజా ది గ్రేట్ కాంబో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ఐతే ఎప్పుడు చేసినా అనిల్, రవితేజ కలయికతో మరో సూపర్ హిట్ సినిమా వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాల లిస్ట్ లో కింగ్ నాగార్జున, రవితేజ తో పాటు మరికొంతమంది స్టార్స్ ఉన్నారని తెలుస్తుంది. అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేసినా కూడా ఆ హీరో తాలూకా ఇమేజ్ తో పాటు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి పక్కా హిట్ దక్కుతుంది.
