ప్రభాస్ కు పోటీగా బాలీవుడ్ హీరో
ధురంధర్ టీజర్ ఇవాళ రణ్‌వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా రిలీజైంది. ఈ టీజర్ లో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
By: Tupaki Desk | 6 July 2025 8:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో భారీ బిజినెస్‌లు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే హార్రర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది.
డిసెంబర్ 5న ది రాజా సాబ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గత నెలలో రాజా సాబ్ టీజర్ ను లాంచ్ చేస్తూ రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ది రాజా సాబ్ కు పోటీగా ఓ బాలీవుడ్ సినిమా రిలీజవుతుంది. అదే ధురందర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా డిసెంబర్ 5నే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ధురంధర్ టీజర్ ఇవాళ రణ్‌వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా రిలీజైంది. ఈ టీజర్ లో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5న ధురంధర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకుని రివీల్ చేశారు. ఈ సినిమా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ జీవిత కథ నుంచి స్పూర్తి పొంది తీశారని సమాచారం. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మొన్నటివరకు ది రాజా సాబ్ కు సోలో రిలీజ్ దక్కిందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆనంద పడుతుండగా, ఇప్పుడు రేసులోకి రణ్‌వీర్ సింగ్ వచ్చి వారి ఆనందంపై నీళ్లు చల్లారు. దీంతో ఈసారి డిసెంబర్ 5న ఇండియన్ సినిమా మునుపెన్నడూ చూడని క్లాష్ ను చూడబోతుందని అర్థమవుతుంది. ఇటు ప్రభాస్‌కు, అటు రణ్‌వీర్ సింగ్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఒకే రోజున వీరిద్దరూ సినిమాలు రిలీజ్ కానుండటం ఓపెనింగ్స్ పై ఎక్కువ ప్రభావాన్ని చూపే ఛాన్సుంది.