Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా.. లీకులపై స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాజాసాబ్’ సినిమాపై అంచనాలు మళ్ళీ పెరుగుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jun 2025 5:13 PM IST
ప్రభాస్ సినిమా.. లీకులపై స్ట్రాంగ్ వార్నింగ్
X

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాజాసాబ్’ సినిమాపై అంచనాలు మళ్ళీ పెరుగుతున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్లాన్ ప్రకారం సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో ఫస్ట్ లుక్ నుంచే ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే ఈ ఇప్పటికే కొన్ని లీక్ అయిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించే ఈ సినిమా, మారుతి కథలోని కామెడీ, యాక్షన్ మిక్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘డార్లింగ్’లో చూపించిన ప్రభాస్ రొమాంటిక్ ఛాయను ఈ సినిమాలో మరింత ఎత్తుకెళ్లే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇక బ్యాలెన్స్ వర్క్ శరవేగంగా జరుగుతోందని, టీజర్‌తో సినిమా హైప్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈనెల 16న విడుదల కానున్న ‘రాజాసాబ్’ టీజర్ లీక్ కావడం ఒక్కసారిగా మేకర్స్ ను షాక్ కు గురి చేసింది. సోషల్ మీడియాలో టీజర్ వీడియో ప్రత్యక్షమైన నేపథ్యంలో, మేకర్స్ గట్టిగా స్పందించారు. ‘లీకైన కంటెంట్‌ను షేర్ చేసే అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిని షేర్ చేయకుండా మాకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాం’ అని సోషల్ మీడియాలో వార్నింగ్ నోట్ జారీ చేశారు. ఇక ఈ లీక్‌ను అడ్డుకోవడానికి మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.

ఈ లీక్ సంఘటనతో ‘రాజాసాబ్’ టీజర్‌పై అభిమానుల్లో కాస్త నిరాశ కలిగినా, మేకర్స్ అధికారిక టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ లీక్ వల్ల సినిమా ఆసక్తి తగ్గకుండా చూడాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు, దీనికి భిన్నమైన రీలీజ్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారని అంటున్నారు.

మరోవైపు, ఈ లీక్‌ను అడ్డుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనూ మేకర్స్ దృష్టి సారించారు. లీక్ వీడియోలను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అభిమానులు కూడా మేకర్స్‌కు సహకరిస్తూ, లీక్ కంటెంట్‌ను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ఈనెల 16న జరిగే అధికారిక టీజర్ విడుదలతో సినిమాపై హైప్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.