రాజాసాబ్ దెబ్బకు సైలెంట్ అయిపోయారే..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. టాలీవుడ్లో కొన్నేళ్లుగా ప్రకంపనలు రేపుతున్న నిర్మాణ సంస్థ. ఈ బేనర్లో ముందు ఎక్కువగా చిన్న సినిమాలే నిర్మించిన నిర్మాత టి.జి.విశ్వప్రసాద్..
By: Garuda Media | 20 April 2026 9:34 AM ISTపీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. టాలీవుడ్లో కొన్నేళ్లుగా ప్రకంపనలు రేపుతున్న నిర్మాణ సంస్థ. ఈ బేనర్లో ముందు ఎక్కువగా చిన్న సినిమాలే నిర్మించిన నిర్మాత టి.జి.విశ్వప్రసాద్.. తర్వాత ఒక్కసారిగా విజృంభించారు. ఒకేసారి రెండంకెల సంఖ్యలో సినిమాలు లైన్లో పెట్టడమే కాక.. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకులను పెట్టి కొన్ని భారీ చిత్రాలను కూడా నిర్మిస్తూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు విశ్వప్రసాద్. ఒక దశలో పీఎంఎఫ్ బేనర్లో పాతిక సినిమాల దాకా వివిధ దశల్లో ఉన్నాయి.ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు .ఈయన చాలా సినిమాలు తీసి ఎంతో మందికి జీవనోపాధి కల్పించారు .
టాలీవుడ్ చరిత్రలోనే ఏ నిర్మాతా ఒకేసారి ఇన్ని సినిమాలు ప్లాన్ చేసింది లేదు. ఇలా ఎలా సాధ్యం అని అందరూ షాకైపోయారు. ఏడాదిలో అయిదారు రిలీజ్‌లతో తరచుగా మీడియాలో కనిపించేవారు విశ్వప్రసాద్. అలాంటి నిర్మాత ఈ జనవరి నుంచి పెద్దగా మీడియా లో కనిపించడం లేదు. ఆయన గురించి వార్తలు లేవు. పీపుల్ మీడియా బేనర్లో కొత్త సినిమాల గురించి కూడా ఎక్కడా చర్చే లేదు. ఇదంతా రాజాసాబ్ సినిమా పుణ్యమే అని చెప్పొచ్చు.
పీఎంఎఫ్ బేనర్లో ఎన్నో డిజాస్టర్లు ఉన్నాయి. ఐతే ఆ సినిమాలు కొట్టిన దెబ్బలను నిర్మాత తట్టుకోగలిగారు. కానీ రాజాసాబ్ దెబ్బ మాత్రం గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. ఒక సినిమా ఫెయిలైనా మీడియాలోకి వచ్చి ఏం పర్లేదు అన్నట్లుగా మాట్లాడే విశ్వప్రసాద్.. రాజాసాబ్ తర్వాత మాత్రం కనిపించడం లేదు. తమ బేనర్లో వచ్చిన ఫెయిల్యూర్ల తాలూకు నష్టాలన్నింటినీ రాజాసాబ్ భర్తీ చేసేస్తుందని గతంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా కొత్తగా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.
ఈ ప్రొడక్షన్ హౌస్ పునాదులనే కదిలించేసింది. ఇన్ని ఫెయిల్యూర్లు, ఇంత నష్టాలతో ప్రొడక్షన్లో కొనసాగడం అవసరమా అనే ప్రశ్న నిర్మాతలో కలిగిందేమో అనే చర్చ జరుగుతోంది టాలీవుడ్లో. ఇంతకుముందు పీఎంఎఫ్ టీం ఎప్పటికప్పుడు కొత్త కథలు వింటూ, కొత్త సినిమాలు ప్లాన్ చేస్తూ బిజీగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆ సంస్థలో తెరకు ఎక్కుతున్న కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయ్ కానీ వాటికీ సంబంధించి వార్తలు లేవు. ముందు ప్లాన్ చేసిన సినిమాలు హోల్డ్‌లో పడ్డాయి. కొత్త కథలు వింటున్న సంకేతాలు కనిపించడం లేదు. ఐతే విశ్వప్రసాద్.. పవన్ కళ్యాణ్‌తో ఓజీ-2 చేస్తారంటూ ఇటీవల ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. మరి అదెంత వరకు నిజమవుతుందో చూడాలి. ఈ దమ్మున్న ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం.
