Begin typing your search above and press return to search.

స‌హానా స‌హానా.. ప్ర‌భాస్-నిధి జంట‌పై క్రేజీ సాంగ్

By:  Tupaki Desk   |   14 Dec 2025 10:40 PM IST
స‌హానా స‌హానా.. ప్ర‌భాస్-నిధి జంట‌పై క్రేజీ సాంగ్
X

2026 సంక్రాంతి బ‌రిలో విడుదల కానున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒకటి -రాజా సాబ్. ప్ర‌భాస్- మారుతి రేర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాల‌న్న ఉత్సాహం అంద‌రిలో ఉంది. చిత్ర‌బృందం ఇప్ప‌టికే ప్ర‌చారంలో వేగం పెంచింది. ఈ సినిమాలోని రెండో పాట విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని మేకర్స్ ఇంత‌కుముందు వెల్ల‌డించారు.

ఆదివారం సాయంత్రం చిత్ర బృందం తమన్ స్వరపరిచిన `సహనా సహనా` అనే రెండో సింగిల్ ప్రోమోను విడుదల చేసింది. ఈ పాటను స్పెయిన్‌లోని సుందరమైన లొకేష‌న్ల‌లో చిత్రీకరించారు. అంద‌మైన ప్ర‌కృతి, స‌ర‌స్సు స‌మీపంలో చిత్రీక‌రించిన వీడియో గ్లింప్స్ యూత్ లోకి వేగంగా దూసుకెళ్లింది. పూర్తి వీడియో సాంగ్ డిసెంబ‌ర్ 17 2025 సాయంత్రం 6:35 గంటలకు విడుదల కానుంది.

ఈ పాటను ప్రభాస్ - నిధి అగర్వాల్ జంట‌పై చిత్రీకరించారు. ఆ ఇరువురి న‌డుమా కెమిస్ట్రీ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంద‌ని ఈ విజువ‌ల్ చెబుతోంది. తాజాగా రిలీజ్ చేసిన‌ ప్రోమో ఎంతో ప్లెజెంట్ గా ఆక‌ట్టుకుంది. రెండు లైన్ల సాహిత్యంతో ఈ పాట రేంజ్ ఏంటో అంద‌రికీ అర్థ‌మైంది. ఈ పాట‌లో ప్ర‌భాస్ పూర్తి వైట్ అండ్ వైట్ దుస్తుల‌లో క‌నిపించ‌గా, నిధి అగ‌ర్వాల్ ప‌సుపు రంగు దుస్తుల‌లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఈ పాట‌ పూర్తి వెర్షన్ ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ గా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ హారర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. మాళవిక మోహనన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌. రిద్ధి కుమార్, సంజయ్ దత్, సత్య త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.