Begin typing your search above and press return to search.

రాజా సాబ్ ఆ ఛాన్స్ ఉన్నా రిస్క్ తీసుకోవట్లేదా..?

మారుతి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమా మొదలైన నాటి నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్స్ తనని ఎంత టార్గెట్ చేస్తున్నా మారుతి మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 April 2025 1:00 AM IST
Raja Saab Update
X

రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా అని తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటుతున్న ప్రభాస్ ఇలాంటి ఒక కథ చేయడం సాహసమే అని అంటున్నారు.

మారుతి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమా మొదలైన నాటి నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్స్ తనని ఎంత టార్గెట్ చేస్తున్నా మారుతి మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. మారుతి రాజా సాబ్ సినిమా అప్డేట్స్ విషయంలో కాస్త వెనకపడి ఉన్నాడన్న కామెంట్ ఉన్న ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని అంటున్నారు. ఐతే ప్రభాస్ ఈమధ్య ఏ సినిమా చేసినా అది రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ రిలీజైన సలార్, కల్కి 2898 ఏడి సినిమాలు రెండో భాగానికి రెడీ అవుతున్నాయి. త్వరలో రాబోతున్న రాజా సాబ్ సినిమా ఇప్పటివరకు ఒక పార్ట్ గానే తెస్తున్నారన్న టాక్ ఉంది. రాజా సాబ్ కూడా రెండు భాగాలుగా చేసే స్కోప్ ఉన్నా రెండేళ్ల నుంచి షూటింగ్ చేస్తూ మళ్లీ ఒక భాగమే అంటే ఆడియన్స్ షాక్ అవుతారు. అదీగాక మారుతి ముందు నుంచి రాజా సాబ్ ని ఒక సినిమాగానే ముగించాలని ఫిక్స్ అయ్యాడట.

అందుకే మారుతి రాజా సాబ్ కోసం తన బెస్ట్ ఇచ్చేస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడెప్పుడో సినిమా నుంచి ఒక మోషన్ పోస్టర్ మాత్రమే వదిలారు కానీ ఆ తర్వాత టీజర్ కానీ కనీసం పోస్టర్ కానీ వదల్లేదు. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే చిత్ర యూనిట్ చేస్తున్న ఈ అశ్రద్ధకు రెబల్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ లో ఉన్నారు. ఇంతకీ రాజా సాబ్ ఎప్పుడొస్తాడు.. ఎలా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాడన్నది చూడాలి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఆ నెక్స్ట్ లైన్ లో సందీప్ వంగ స్పిరిట్, కల్కి 2 సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆ సినిమాలు మొదలు పెట్టాలని చూస్తున్నారు.