Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'రాజాసాబ్'.. మరీ ఎక్కువైనట్టు ఉందే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Feb 2026 11:00 PM IST
ప్రభాస్ రాజాసాబ్.. మరీ ఎక్కువైనట్టు ఉందే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాగా.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రోలింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. స్టోరీ, యాక్టింగ్ పై డిస్కస్ చేసుకునే బదులు.. చిన్న చిన్న మిస్టేక్స్ ను గుర్తించి పోస్టులు పెడుతున్నారు.

నిజానికి.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ట్రోల్స్ వచ్చాయి. కానీ ఓటీటీలోకి వచ్చాక బాగా పెరిగాయి. ప్రతి సీన్‌ ను గమనిస్తూ.. అందులో ఏ చిన్న మిస్టేక్ కనిపించినా దాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా కొందరు నెటిజన్లు బిహేవ్ చేస్తున్నారు. సినిమాలో ఒక యాక్షన్ సీన్ లో ప్రభాస్ గూండాల నుంచి హీరోయిన్ మాళవిక మోహనన్‌ ను కాపాడే సీన్ లో బైక్‌ ల విషయంలో కనిపించిన తేడాపై పోస్టులు పెడుతున్నారు.

సీన్ స్టార్టింగ్ లో కనిపించినవి ఒక బ్రాండ్ బైక్‌ లు అయితే.. చివరికి ప్రమాదానికి గురయ్యేవి మరో బ్రాండ్‌ కు చెందినవిగా ఉన్నాయని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అలాంటి ఎలిమెంట్స్ ను పట్టుకుని సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. అలా రాజా సాబ్ లో తప్పులు వెతకడం కొందరికి ఓ పనిలా మారిపోయిందేమో. రోజుకొక కొత్త స్క్రీన్‌ షాట్, రోజుకొక కొత్త మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో సినిమా చూసే ఆడియన్స్ లో కూడా ఒక రకమైన నెగిటివిటీ పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి.. పెద్ద బడ్జెట్‌ తో తెరకెక్కిన, వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఉండటం కొత్తేమీ కాదు. కానీ వాటిని పక్కనపెట్టి.. సినిమాను సినిమాలా ఎంజాయ్ చేయాలని కొందరు సినీ ప్రియులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్, ఫాలోవర్స్ కోసం సినిమాల్లో తప్పులు వెతికి చూపించడం ఒక అలవాటుగా మారితే, అది మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా ప్రతి సినిమాను క్లియర్ గా చూసి తప్పులు గుర్తిస్తే, ప్రేక్షకులు కంటెంట్‌ ను ఆస్వాదించలేరని చెప్పాలి. సినిమా అనేది నిజ జీవితానికి మిర్రర్ లా ఉండాల్సిన అవసరం లేదని, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమేనని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మొత్తానికి ది రాజా సాబ్ చుట్టూ జరుగుతున్న ట్రోలింగ్‌ ఒక సినిమాకే పరిమితం కాకుండా.. ఫ్యూచర్ లో వచ్చే ప్రతి మూవీపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న సినీ ప్రియుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తప్పులు వెతకడంలో కాకుండా.. స్టోరీ, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ వంటి ఎలిమెంట్స్ పై దృష్టి పెడితే సినిమా చూసిన థ్రిల్ దక్కుతుందని చెబుతున్నారు. ఇకపై చిన్న చిన్న తప్పులు వెతకడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.