రాజా సాబ్ నెక్స్ట్ ఛాయిస్ ఎవరు..?
రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు దర్శకుడు మారుతి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 21 July 2025 9:40 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు దర్శకుడు మారుతి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ తో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ ఇచ్చే మ్యూజిక్ కూడా రాజా సాబ్ కి మరో హైలెట్ అయ్యేలా ఉందని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా విషయంలో ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు మారుతి. సినిమా అప్డేట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ తనని ఎంత టార్గెట్ చేస్తున్నా కూడా డార్లింగ్ ఫ్యాన్స్ సైడ్ నుంచి వాళ్ల ఆకలి తెలుసుకుంటున్నాడు మారుతి.
ఐతే ఫ్యాన్స్ కి ఫీస్ట్ పక్కా అనిపించేలా రాజా సాబ్ ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్యనే రిలీజైన టీజర్ చూస్తేనే సంథింగ్ డిఫరెంట్ గా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మారుతి క్రేజ్ పరంగా డబుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న మారుతి ఇక మీదట నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు.
రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. ఐతే రాజా సాబ్ తర్వాత మారుతి చేసే సినిమాల విషయంలో క్లారిటీ రాలేదు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రాజా సాబ్ మీద పెట్టిన మారుతి నెక్స్ట్ సినిమా ఏంటన్న క్లారిటీ రాలేదు. మారుతి నెక్స్ట్ హీరో ఎవరన్న ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా నడుస్తుంది. రాజా సాబ్ సినిమా అనుకున్న విధంగా బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం నెక్స్ట్ సినిమా రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.
డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటేనే మారుతి రేంజ్ పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఆ సినిమా తర్వాత మారుతి ఏ హీరోతో చేసినా అది నేషనల్ వైడ్ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి మారుతి డైరెక్షన్లో ఆ ఛాన్స్ ఎవరందుకుంటారన్నది చూడాలి. రాజా సాబ్ తర్వాత మారుతి కెరీర్ పరంగా కూడా కాత బిగ్ స్టెప్ వేసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఈరోజుల్లో లాంటి చిన్న సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన మారుతి ఇలా రాజా సాబ్ సినిమా చేసే రేంజ్ కి వెళ్లడం నిజంగానే గొప్ప విషయమని చెప్పొచ్చు.
