ఐటం పాట కోసం కరీనా కపూర్ ని ట్రై చేస్తున్నారా?
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ నత్త నడకన సాగిన షూటింగ్ ఇప్పుడు పరుగులు పెడుతోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 4:00 PM ISTప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ నత్త నడకన సాగిన షూటింగ్ ఇప్పుడు పరుగులు పెడుతోంది. చక్కా చకా షూటింగ్ పూర్తిచేసే పనిలో పడ్డారు. జులై తొలి వారంలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. అందులో ప్రభాస్ కూడా పాల్గొంటాడు. అది పూర్తయితే చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లే. అటుపై పాటల చిత్రీకరణ మొద లవుతుంది.
ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటం సాంగ్ కూడా ఉంది. ప్రభాస్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆ పాటను డిజైన్ చేస్తున్నారు. తొలుత ఈ పాట కోసం థమన్ ఓ బాలీవుడ్ సినిమా గీతాన్ని రీమిక్స్ చేయాలని భావించాడు. కానీ తర్వాత ఆలోచన విరమించకుని ఓ ప్రెష్ సాంగ్ తోనే రావాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే ఆ పాటలో ఐటం భాగమా లేడీ సూపర్ స్టార్ నయనతార అయితే బాగుంటుందనుకున్నారు.
ఆమెను ఆప్రోచ్ అయినట్లు వార్తలొచ్చాయి. అయితే నయన్ ఆ పాటలో నటించడానికి అంగీకరించలేదని తేలింది. ఆ తర్వాత మళ్లీ ఐటం సాగ్ చర్చ రాలేదు. ప్రభాస్ `పౌజీ` షూటింగ్ లో బిజీగా ఉండం..రాజాసాబ్ హెల్డ్ లో పడటంతో ఎలాంటి చర్చ రాలేదు. తాజాగా షూట్ ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ ఐటం పాట లో హీరోయిన్ ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో మళ్లీ వాడి వేడి చర్చ జరుగుతుంది.
ఈనేపథ్యంలో మారుతి ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలి సింది. ఇప్పటికే ఓ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. మరి ఈ ఆఫర్ విష యంలో కరీనా ఎలా స్పందిస్తుందో చూడాలి. కరీనా కపూర్ బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్. తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కరీనా ఐటం పాటలకు ఒప్పు కుంటుందా? లేదా? అన్నది చూడాలి.
