డేటింగ్‌పై కాదు నటనపై దృష్టి పెట్టు
బుల్లితెర నటి శ్వేతాతివారీ కుమార్తె పాలక్ తివారీ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమాలతో కంటే డేటింగ్ లైఫ్ తో ఈ బ్యూటీ మీడియా హెడ్ లైన్స్ లో కొస్తోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 9:45 AM ISTబుల్లితెర నటి శ్వేతాతివారీ కుమార్తె పాలక్ తివారీ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమాలతో కంటే డేటింగ్ లైఫ్ తో ఈ బ్యూటీ మీడియా హెడ్ లైన్స్ లో కొస్తోంది. ఆరంభం ఒకట్రెండు సినిమాల్లో నటించినా ఈ భామ ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంది. కానీ సినిమాలు, నటనతో కంటే, డేటింగ్ లైఫ్ గురించే బహిరంగంగా ఎక్కువ చర్చ జరుగుతుండడం తన తండ్రికి నచ్చడం లేదని అతడి మాటలు చెబుతున్నాయి.
తాజాగా పాలక్ తల్లి నుంచి విడిపోయిన తన తండ్రి, టీవీ నటుడు రాజా చౌదరి కుమార్తెకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. డేటింగ్ లైఫ్ పై కాదు.. నటనను మొదలు పెట్టాలని తన కుమార్తెకు ఆయన సూచించారు. అప్ కమ్ నటులు డేటింగుల కంటే నటనను నేర్చుకునేందుకు ఇష్టపడాలని పరోక్షంగా హెచ్చరించారు. అపరిపక్వ దశ నుంచి జీవితంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ తర్వాతే ప్రేమపై దృష్టి పెట్టొచ్చని అన్నారు.
సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో పాలక్ నటించింది. ఇటీవలే `భూత్ని` సినిమాలో కనిపించింది. నటించిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. కానీ పాలక్ అందచందాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అదే సమయంలో ఈ భామ సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో డేటింగ్ లో ఉండటం చర్చనీయాంశమైంది. పాలక్ ఇంకా సాధించిందేమీ లేదు. అలాగే ఇబ్రహీం కూడా నాదనియాన్ తో తెరకు పరిచయమైనా, ఆశించిన విధంగా రాణించలేదని విమర్శలొచ్చాయి. అందుకే ఈ ఇద్దరూ నటనపై దృష్టి సారించాని పరిణతితో ఆలోచించాలని రాజా చౌదరి సూచించారు. అతడి వ్యాఖ్యలను నెటిజనులు సమర్థిస్తున్నారు.
