Begin typing your search above and press return to search.

'విశ్వమంతా చూస్తున్నారు'.. రాజ్ నిడిమోరు వైఫ్ పోస్ట్ వైరల్

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, స్టార్ హీరోయిన్ సమంత రిలేషన్ లో ఉన్నారని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Jun 2025 1:55 AM IST
విశ్వమంతా చూస్తున్నారు.. రాజ్ నిడిమోరు వైఫ్ పోస్ట్ వైరల్
X

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, స్టార్ హీరోయిన్ సమంత రిలేషన్ లో ఉన్నారని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా వారిద్దరూ తరచూ కలిసి కనిపిస్తున్నారు. దీంతో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా సామ్.. నిర్మాతగా శుభం మూవీని రూపొందించారు. ఆ సినిమాకు రాజ్‌ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వర్క్ చేశారు.

ఆ చిత్రం రిలీజ్ అయ్యాక సమంత.. మూవీ టీమ్, డైరెక్టర్ రాజ్ తో దిగిన పిక్స్ ను పోస్ట్ చేశారు. శుభంతో అద్భుతమైన జర్నీ మొదలైందని రాసుకొచ్చారు. ఆ తర్వాత రాజ్ భుజంపై వాలిన పిక్ ను షేర్ చేశారు. ఇప్పుడు ఈ వారం తనకు ఎలా గడిచిందో చెబుతూ.. శనివారం ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

పిక్స్, వీడియోస్ ను సామ్ షేర్ చేయగా.. అందులో ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. రాజ్ తో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న విజువల్స్ ఉన్నాయి. అయితే సామ్‌ పిక్స్, వీడియో షేర్ చేసిన సమయంలోనే రాజ్‌ సతీమణి శ్యామాలి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అయితే కొద్ది రోజులుగా మెసేజ్ ఓరియంటెడ్ పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే.

తాజాగా కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు శ్యామాలి. కాలం అన్నింటినీ బయటపెడుతుందని, కర్మ సమాధానం చెబుతుందని రాసుకొచ్చారు. ముఖ్యంగా విశ్వం అంతా నిశితంగా చూస్తుంటుందని తెలిపారు. అదంతా రాసి ఉన్న మెసేజ్ ను ఇన్ స్టా స్టోరీలో పెట్టారు. కర్మ, నువ్వేం ఇస్తారో తిరిగి వస్తుంది అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు. ప్రస్తుతం శ్యామాలి పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె పోస్ట్ వెనుక రీజన్ ఏంటోనని మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి సడెన్ గా ఆమె ఇలాంటి పోస్టులు పెడుతున్నారని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.

కాగా, శ్యామాలి సైకాలజీ చదువుకున్నారు. బాలీవుడ్ డైరెక్టర్స్ రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. పలు సినిమాలకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా కూడా పని చేశారు. 2015లో రాజ్ ను వివాహం చేసుకున్న ఆమె.. ఆయన సినిమాలకు వర్క్ చేశారు. కొంతకాలంగా వారిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. కానీ రాజ్‌, సామ్ రిలేషన్ కోసం ప్రచారం జరుగుతున్న వేళ.. ఆమె పోస్టులు చర్చనీయాంశంగా మారాయి.