మనవరాలు పుట్టిందని తెలిసినా స్టార్ హీరో నిర్వాకం
అలాంటి ఒక పంతం కారణంగా లెజెండరీ నటుడు ఆస్పత్రిలో ప్రసవించిన తన కొడుకు భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డను చూసేందుకు వెళ్లలేదు. ఆ ఇద్దరినీ దూరం పెట్టాడు!
By: Tupaki Desk | 21 April 2025 5:00 PM ISTకొందరు పంతం పడితే, దానిని నెగ్గేందుకు ఎంతదాకా అయినా వెళతారు. అలాంటి ఒక పంతం కారణంగా లెజెండరీ నటుడు ఆస్పత్రిలో ప్రసవించిన తన కొడుకు భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డను చూసేందుకు వెళ్లలేదు. ఆ ఇద్దరినీ దూరం పెట్టాడు!
అలాంటి కఠినమైన నియమంతో జీవించిన ఈ లెజెండరీ నటుడు మరెవరో కాదు .. ది గ్రేట్ రాజ్ కపూర్. అతడు తన కుమారుడు రణధీర్ సతీమణి బబిత ఆడబిడ్డను ప్రసవించిందని తెలిసినా చూసేందుకు ఆస్పత్రికి వెళ్లలేదు. అయితే దీనికి కారణం పుట్టే బిడ్డ కచ్ఛితంగా నీలి కళ్లతో పుట్టాలనేది అతడి కండీషన్. ఆసక్తికరంగా రాజ్ కపూర్ మనవరాలు నీలి కళ్లతోనే జన్మించింది. ఈ విషయం తెలుసుకుని అతడు చాలా ఆనందించాడట.
కరిష్మా కపూర్ తన తాతకు ఎప్పుడూ ఇష్టమైన అమ్మాయి. తాత కళ్ల మాదిరి నీలం కళ్లతో పుట్టడంతో తాతా-మనవరాలి అనుబంధం, సెంటిమెంట్ పెద్ద రేంజులో వర్కవుటైంది. ఈ విషయాన్ని కరిష్మా చాలా సందర్భాల్లో చెప్పారు. బబితకు బిడ్డ జన్మించిన వెంటనే నవజాత శిశువును చూడటానికి మొత్తం కపూర్ కుటుంబం ఆసుపత్రికి చేరుకున్నా రాజ్ కపూర్ మాత్రం వెళ్లలేదు. ఈ విషయాన్ని రాజ్ కపూర్ కుమార్తె రీతు నందా రాసిన పుస్తకం `రాజ్ కపూర్: ది వన్ అండ్ ఓన్లీ షోమ్యాన్`లో వెల్లడించారు.
కరిష్మా కపూర్ ఎదిగే వయసులో తాతకు ఎంతో చేరువగా ఉండేది. అలాగే తన మనవరాలు పెద్ద ఎత్తుకు ఎదుగుతుందని, గొప్ప విజయాలు సాదిస్తుందని తాత రాజ్ కపూర్ ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఆయన భావించినట్టే కరిష్మా బాలీవుడ్ ని అగ్ర కథానాయికగా ఏలింది. అయితే సినిమాలలో ఆడపిల్లలు నటించకూడదు! అనే కపూర్ కుటుంబ నియమాన్ని కరిష్మా పాటించలేదు. తాతకు ఝలక్ ఇచ్చి నటనలో ప్రవేశించింది. కరిష్మా అగ్ర కథానాయికగా ఎదిగిన క్రమంలో తన సోదరి కరీనా కపూర్ కూడా కథానాయిక అయింది. కరీనా ప్రస్తుతం అగ్ర కథానాయికగా బాలీవుడ్ లో అత్యుత్తమ స్థానాన్ని అలంకరించింది.
