Begin typing your search above and press return to search.

వెకేష‌న్‌లో గోల్డ్ ఫిష్‌.. ముట్టుకున్నారో కాల్తుంది జాగ్ర‌త్త‌!

రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో తన ఆకర్షణీయమైన రూపానికి త‌గ్గ‌ట్టు హైప్ ని క్రియేట్ చేయ‌డంలో స్పెష‌లిస్ట్.

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:10 AM GMT
వెకేష‌న్‌లో గోల్డ్ ఫిష్‌.. ముట్టుకున్నారో కాల్తుంది జాగ్ర‌త్త‌!
X

సోషల్ మీడియా వేదిక‌లుగా అందాల క‌థానాయిక‌ల‌ ప్రదర్శనలు హ‌ద్దుమీరుతున్నాయి. ఒక‌రినిమించి ఒక‌రు ట్రెండ్ సెట్ట‌ర్లుగా మారుతున్నారు. ఈ ట్రెండ్ లలో రాయ్ లక్ష్మి పేరు నిరంత‌రం వినిపిస్తూనే ఉంది. సామాజిక మాధ్య‌మాల్లో భారీ ఫాలోయింగ్ ని క‌లిగి ఉన్న ఈ భామ వ‌రుస‌గా హాట్ ఫోటోషూట్ల‌తో యూత్ ని కిల్ చేస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో వెకేష‌న్ ని ఆస్వాధిస్తున్న రాయ్ లక్ష్మి బీచ్ సైడ్ రిలాక్సేషన్‌లో బికినీలో వీక్షకులను ఆకర్షించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.


రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో తన ఆకర్షణీయమైన రూపానికి త‌గ్గ‌ట్టు హైప్ ని క్రియేట్ చేయ‌డంలో స్పెష‌లిస్ట్. గతంలో అనేక సందర్భాల్లో ఆ అందానికి అభిమానులు మంత్రముగ్ధులు అయ్యారు. రాయ్ లక్ష్మి నిరంత‌రం ఓపెన్ టాప్‌లు, బికినీలు, బీచ్‌వేర్‌లతో త‌న‌కంటూ ఒక వేవ్ ఉంద‌ని నిరూపించింది. అయితే ఈ భామ కెరీర్ అందుకు భిన్నంగా ఉంది. న‌టిగా పూర్తిగా రేసులో పూర్తిగా వెన‌క‌బ‌డింది.


అయినా రాయ్ ల‌క్ష్మీ ఎప్పుడూ నిరాశ‌ప‌డ‌లేదు. త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి తో 'ఖైదీ నంబర్ 150'లో అతిథి పాత్ర ఐట‌మ్ నంబ‌ర్ తో మైమ‌రిపించింది. సర్దార్ గబ్బర్ సింగ్‌లో పాత్ర‌తోను ప‌వ‌న్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చింది. ఈ రెండు పెద్ద సినిమాలు రాయ్ ల‌క్ష్మీ ఇమేజ్ ని పెంచాయ‌ని చెప్పాలి. బాలీవుడ్ లోను ఈ డ‌స్కీ బ్యూటీ అడుగుపెట్టింది.


జూలీ 2లో అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌తో చెరగని ముద్ర వేసింది. తదనంతరం 'పాయిజన్ 2' సిరీస్ లో న‌టించి వీక్ష‌కుల‌దృష్టిని ఆకర్షించింది. కాంచనమాల కేబుల్ టీవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ అటుపై తెలుగు-త‌మిళ భాష‌ల్లో సుదీర్ఘ కాలం నాయిక‌గా కొన‌సాగింది. 'కర్కా కసదర' చిత్రంతో కోలీవుడ్ లో ఎట్రీ ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె చేసిన వెంచర్లతో పోలిస్తే తమిళ సినిమా రంగంలోనే రాయ్ లక్ష్మీకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి.