Begin typing your search above and press return to search.

హీటెక్కించేలా తమన్నా 'నషా'

తాజాగా విడుదలైన "నషా" అనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. టి-సిరీస్ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సాంగ్‌కు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

By:  Tupaki Desk   |   11 April 2025 4:15 PM IST
హీటెక్కించేలా తమన్నా నషా
X

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘రైడ్ 2’ (Raid 2) మే 1న విడుదల కానుంది. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదొక క్రైమ్ డ్రామా కాన్వాస్ మీద రూపొందుతున్న ప్రాజెక్ట్. మొదటి భాగం విజయవంతమైన తరుణంలో ‘రైడ్ 2’పై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు తమన్నా స్పెషల్ సాంగ్ "నషా" అదనపు ఆకర్షణగా మారింది.

తాజాగా విడుదలైన "నషా" అనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. టి-సిరీస్ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సాంగ్‌కు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. తమన్నా గ్లామరస్ లుక్, ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులు.. ఇవన్నీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటలో ఆమె గోల్డెన్ టాప్, వైట్ స్కర్ట్ లుక్‌లో కనిపించి ఓ రేంజ్‌లో సర్ ప్రైజ్ చేసింది.

ఈ పాటకు జాస్మిన్ శాండ్‌లాస్, సచేత్ టాండన్, దివ్య కుమార్, సుమంతో ముఖర్జీ కలిసి గానం చేశారు. జానీ సాహిత్యం అందించగా, మ్యూజిక్‌ను ‘వైట్ నాయిస్ కలెక్టివ్‌’ అందించింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ పని చేసిన ఈ పాటలో వినిపించే రిథమ్, హుక్ లైన్స్ అన్నీ యూత్‌ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా తమన్నా స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. పాట చిత్రీకరణ గ్రాండ్ గా జరగగా, మాస్ క్లాస్ ఆడియెన్స్‌కి ఇది పక్కా విజువల్ ఫీట్ లాగా మారింది.

‘రైడ్ 2’లో అజయ్ దేవగన్ మరోసారి ఐటి ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయనకు అపొజిట్ గా రితేశ్ దేశ్‌ముఖ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల్లో వాని కపూర్, రాజత్ కపూర్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే, తమన్నా చేసిన ఐటెం సాంగ్ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో ప్రధాన హైలైట్‌గా మారింది.

ఇప్పటివరకు తమన్నా నటించిన ఐటెం సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే "నషా" పాటలో ఆమె హావభావాలు, స్టెప్పులు, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే ఇది మరో చార్ట్ బస్టర్‌గా నిలవబోతోందని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ పాట మ్యూజిక్ రీల్స్‌, డాన్స్ కవర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సాంగ్ సక్సెస్ తో రైడ్ 2 బిజినెస్ కి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చూస్తే, తమన్నా "నషా"తో మాస్ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించే పనిలో పడ్డారు. మే 1న సినిమా విడుదలతో పాటు ఈ పాట థియేటర్ లో వెండి తెరపై ఎలా హైలెట్ అవుతుందో చూడాల్సిందే.