ఇలియానా ఇండియా వదిలేసిందా? సినిమాలకు ఇలియానా రిటైర్మెంట్!
ఇలాంటి సమయంలో రైడ్ 2 సినిమాలో ఇలియానా నటించక పోవడం చాలా పెద్ద లోటు అంటున్నారు.
By: Tupaki Desk | 16 May 2025 1:00 AM ISTబాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'రైడ్' లో అజయ్ దేవగన్‌కి జోడీగా ఇలియానా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు, అజయ్ దేవగన్‌కి ఇలియానా సరి జోడీ అన్నట్లుగా ఉంది అంటూ ఆ సమయంలో రివ్యూలు వచ్చాయి. చాలా మంది అజయ్ దేవగన్‌తో ఇలియానా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకున్నారు. ఇటీవల రైడ్ సినిమాకు సీక్వెల్ వచ్చింది. రైడ్ 2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన దక్కింది. అజయ్ దేవగన్ చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైడ్ 2 సినిమాలో ఇలియానా నటించక పోవడం చాలా పెద్ద లోటు అంటున్నారు.
రైడ్ 2 సినిమాలో అజయ్ దేవగన్ భార్య పాత్రలో ఇలియానాను కాకుండా వాణి కపూర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఆమె అజయ్ దేవగన్ భార్య పాత్రలో మంచి నటనతో మెప్పించింది. అయితే ఆమె కంటే ఇలియానా ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలియానాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా కూడా ఆమె స్థానంలో వాణీ కపూర్‌ను తీసుకు వచ్చి పెట్టడం అనేది అతి పెద్ద తప్పిదం అంటూ బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇలియానా నటించి ఉంటే మరింతగా బాగుండేది అంటున్న వారు చాలా మంది ఉన్నారు. రైడ్ 2 సినిమాలో ఇలియానా నటించక పోవడంకి కారణంపై దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా స్పందించారు.
ఇటీవల దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమా మాలిని పాత్రను ఇలియానా చేసి ఉంటే బాగుండేదని అందరితో పాటు తాను కూడా అనుకుంటాను. అయితే ఇలియానా పెళ్లి చేసుకుని, తల్లి అయి, ప్రస్తుతం అమెరికాలో ఉన్న కారణంగా రైడ్ 2 సినిమాలో ఆమె నటించలేక పోయింది. ఆమె లేని లోటు కనిపించింది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. రైడ్ సినిమాలో ఆమె నటనను ఎంజాయ్ చేసిన వారు రైడ్ 2 లోనూ ఆమె ఉంటే బాగుండేది అనుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు, ఆమె అందుబాటులో లేక పోవడం వల్లే ఆమె స్థానంలో వాణీ కపూర్‌ను తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. రైడ్ ప్రాంచైజీ నుంచి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.
అజయ్ దేవగన్‌కే కాకుండా బాలీవుడ్‌కి కూడా రైడ్ 2 సినిమా బూస్ట్‌గా పనిచేసింది అనడంలో సందేహం లేదు. రైడ్ 2 సినిమాలో వాణి కపూర్ నటించడంతో ఆమె కెరీర్‌కి సైతం మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని మొదటి నుంచి ఆమె సన్నిహితులు నమ్మకంతో ఉన్నారు. ఇలియానా ఈ మధ్య కాలంలో కాస్త బొద్దుగా మారడంతో పాటు మునుపటి మాదిరిగా స్కిన్ షో చేసే వీలు ఉండదేమో అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్కిన్ షో చేసేందుకు నిరాకరించడం వల్లే ఆమెను తప్పించి ఉంటారా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఇలియానా రైడ్ 2 లో ఎందుకు లేదు అనే విషయం గురించి దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడ్డట్లు అయింది.
