Begin typing your search above and press return to search.

నానితో ఛాన్స్ మిస్ చేసుకున్న రెహమాన్ మేనల్లుడు

ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడిగా జీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ టైమ్ లోనే టాప్ లో ఉన్న వారికి కూడా గట్టి పోటీని ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   9 April 2024 12:59 PM GMT
నానితో ఛాన్స్ మిస్ చేసుకున్న రెహమాన్ మేనల్లుడు
X

కోలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడిగా జీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ టైమ్ లోనే టాప్ లో ఉన్న వారికి కూడా గట్టి పోటీని ఇచ్చాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్ కుమార్ కొనసాగుతున్నాడు.


ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూనే మరో వైపు హీరోగా కూడా జీవీ తన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాకి మొదటిగా తెలుగులో మ్యూజిక్ అందించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే తమిళంలో సక్సెస్ కావడంతో ఎప్పుడో ఒకసారి మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ఆడియన్స్ ని పలకరిస్తున్నారు.

ప్రభాస్ డార్లింగ్, రామ్ ఎందుకంటే ప్రేమంటా సినిమాలకి కూడా జీవీ మ్యూజిక్ అందించారు. చివరిగా జీవీ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాలు ఆదికేశవ, టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాలు రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం తెలుగులో లక్కీ భాస్కర్, రాబిన్ హుడ్ సినిమాలకి జీవీ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా చేసిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ జీవీ ప్రకాష్ కుమార్ జంటగా నటించిన డియర్ మూవీ తమిళ్, తెలుగు భాషలలో ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో జీవీ ప్రకాష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాని దసరా సినిమాలో దీక్షిత్ చేసిన క్యారెక్టర్ మొదటిగా తనకే వచ్చిందని రివీల్ చేశాడు. అయితే ఆ సమయంలో టైట్ షెడ్యూల్ ఉండటం వలన దసరా మూవీ మిస్ చేసుకున్నానని తెలిపారు. కచ్చితంగా భవిష్యత్తులో ఒక తెలుగు మూవీ చేస్తానని ఈ సందర్భంగా జీవీ తెలిపారు. ఒక వేళ దసరా మూవీలో జీవీ ప్రకాష్ కుమార్ చేసి ఉంటే కచ్చితంగా ఆ సినిమాకి తమిళంలో కూడా మంచి ఆదరణ లభించేదనే మాట వినిపిస్తోంది.

నెక్స్ట్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో నాని ఇంకో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో ఏమైనా జీవీ ప్రకాష్ కుమార్ కి స్పెషల్ క్యారెక్టర్ శ్రీకాంత్ ఇస్తాడా అనేది చూడాలి. డియర్ మూవీ తెలుగులో హిట్ అయితే కచ్చితంగా భవిష్యత్తులో అతని నుంచి స్ట్రైట్ తెలుగు మూవీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు జీవి ప్రకాష్ బాక్సాఫీస్ వద్ద హీరోగా సాలీడ్ హిట్ అయితే అందుకోలేదు. మరి రాబోయే సినిమాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.