Begin typing your search above and press return to search.

AR రెహమాన్‌పై బాలీవుడ్ హీరోల చిన్న చూపు?

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్బ్యూలో రెహ‌మాన్ చెప్పిన సంగ‌తి అవాక్క‌య్యేలా చేసింది. అప్ప‌ట్లో మాఫియా బెదిరింపుల‌కు భ‌య‌ప‌డి తాను ఏనాడూ ముంబైలో నివ‌శించ‌లేద‌ని ఏ.ఆర్.రెహ‌మాన్ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:21 AM GMT
AR రెహమాన్‌పై బాలీవుడ్ హీరోల చిన్న చూపు?
X

ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన స్వ‌ర‌మాంత్రికుడు AR రెహమాన్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. అత‌డి స్వ‌రాల‌కు అభిమాని కానివారు ఉండ‌రు. ఆస్కార్ అందుకున్న "స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్"కి అద్భుత సంగీతం అందించిన‌ రెహ‌మాన్ వేదిక‌పై పుర‌స్కారాలు అందుకున్నారు. బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్- బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో రెహమాన్ ప్ర‌తిభ‌కు పుర‌స్కారాలు ద‌క్కాయి. భార‌త‌దేశం గొప్ప‌గా చెప్పుకోవ‌డానికి అప్ప‌టికి ఆస్కార్ అవార్డు తెచ్చిన ఏకైక ప్ర‌తిభావంతుడు రెహ‌మాన్ మాత్ర‌మే. ఉత్త‌రాదిన ఎంద‌రు దిగ్గ‌జాలు ఉన్నా సాధించ‌లేని ఫీట్ ని రెహమాన్ సాధించి చూపించారు.

అయితే ఏ.ఆర్.రెహ‌మాన్ ని భార‌త‌దేశంలో అత్యుత్త‌మ స్వ‌ర‌క‌ర్త అని అంగీక‌రించేందుకు అప్ప‌ట్లో ఉత్త‌రాది హీరోలు కానీ ఫిలింమేక‌ర్స్ కానీ ఆస‌క్తిగా లేరు. ఒక ద‌క్షిణాదికి చెందిన సంగీత ద‌ర్శ‌కుడి హవాను వారు డైజెస్ట్ చేసుకోలేదు. అంతేకాదు.. రెహ‌మాన్ పై రింగ్ మాస్ట‌ర్లు కుట్ర‌ప‌న్నార‌ని కూడా టాక్ వినిపించింది. అదే క్ర‌మంలో ఏ.ఆర్.రెహ‌మాన్ పూర్తిగా వ‌ర‌ల్డ్ టూర్ ల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చారు.

అంతేకాదు.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్బ్యూలో రెహ‌మాన్ చెప్పిన సంగ‌తి అవాక్క‌య్యేలా చేసింది. అప్ప‌ట్లో మాఫియా బెదిరింపుల‌కు భ‌య‌ప‌డి తాను ఏనాడూ ముంబైలో నివ‌శించ‌లేద‌ని ఏ.ఆర్.రెహ‌మాన్ వ్యాఖ్యానించారు. చెన్నై లేదా విదేశాల నుంచి మాత్ర‌మే హిందీ సినిమాల‌కు సంగీతం అందించాన‌ని గుర్తు చేసుకున్నారు. హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ చుట్టూ ఉండే వాతావ‌ర‌ణంపై రెహ‌మాన్ లో ఎంత‌గా ఏహ్య‌భావం ఉందో ఇది అర్థ‌మ‌య్యేలా చెబుతోంది.

రెహ‌మాన్ ఈ వ్యాఖ్య‌లు చేసిన కొద్దిరోజుల‌కు సల్మాన్ ఖాన్ AR రెహమాన్‌ని "యావ‌రేజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్" అని పిలిచిన పాత వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. అయితే అత‌డి స్పంద‌న‌కు మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహ‌మాన్ అంతే వ్యంగ్యంగా స‌మాధాన‌మిచ్చారు. ఇప్పుడు ఒక రెడ్డిట్ వినియోగదారు సల్మాన్ కి చెందిన పాత వీడియోను షేర్ చేసారు. ఆ వీడియోలో మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్‌ను "యావ‌రేజ్ స్వరకర్త" అని భాయ్ సరదాగా పిలిచాడు. త‌న సినిమాకి పని చేయమని రెహ‌మాన్ ని కోరాడు. ఆసక్తికరంగా AR రెహమాన్ కూడా తన శైలిలో చమత్కారమైన సమాధానం ఇచ్చారు.

ఇక ఇదే వీడియో గురించి విశ్లేషిస్తూ ఒక నెటిజన్ ఇలా రాశాడు. ""ఏఆర్ రెహ్మాన్ సల్మాన్ ఖాన్‌ను ఇష్టపడడు - బాడీ లాంగ్వేజ్ మనందరికీ చెబుతుంది. సల్మాన్ అతనిని యావరేజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని పిలిచాక ARR తో షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి స‌ల్మాన్ ప్రయత్నించాడు. కానీ ARR త‌న‌ జేబులోనే చేతులు ఉంచాడు కాబట్టి సల్మాన్ బలవంతంగా జేబులోంచి ARR చేతులను బయటకు తీశాడు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఒక స్వ‌ర‌క‌ర్త‌ను స‌ల్మాన్ "యావ‌రేజ్" అని స‌ర‌దాగా పిలవడం కూడా ARRకి నచ్చలేదు.. అని విశ్లేషించారు.

మరొకరు నెటిజ‌న్ దీనిని ఇలా విశ్లేషించారు. "హమారే సాథ్ కబ్ కామ్ కరేంగే"కి బదులుగా సల్మాన్ "హమారే లియే కబ్ కామ్ కరేంగే" అని చెప్పడం వల్ల ARRకి కోపం వచ్చిందని నేను భావిస్తున్నాను. ""ఎ.ఆర్. రెహమాన్ శ‌త్రువుల‌ సినిమాలను కూడా నాశనం చేయలేనంత మంచి సంకల్పం ఉన్న స్వ‌ర‌కర్త‌"" అని కూడా ఒకరు రాశారు.