Begin typing your search above and press return to search.

గారాల ప‌ట్టితో అమ్మ‌-నాన్న

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ జోడీ క్రిస్మ‌స్ ని పుర‌స్క‌రించుకుని కుమార్తె ర‌హ‌ని మీడియా ముందుకు తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 1:50 PM GMT
గారాల ప‌ట్టితో అమ్మ‌-నాన్న
X

ఇటీవ‌లే 'యానిమ‌ల్' తో భారీ బ్లాబ‌స్ట‌ర్ అందుకున్నాడు ర‌ణ‌బీర్ క‌పూర్. క‌పూర్ బోయ్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఈ సినిమాతో తెలుగులోనూ పెద్ద స్టార్ అయిపోయాడు. ఓ స్ట్రెయిట్ సినిమా హిట్ అయితే ఎంత పేరు తీసుకొస్తుందో? అంత‌కు మించిన పేరు...ఐడెంటిటీని 'యానిమల్' తెలుగులోనూ తెచ్చిపెట్టింది. ఇక భార్య‌ అలియాభ‌ట్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్నాళ్ల‌గా తిరుగులేని నాయిక‌గా బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది.

వ‌రుస హిట్లు అందుకుంటూ అంత‌కంకు స్టార్ డ‌మ్ ని రెట్టింపు చేసుకుంటుంది. ఈ ఏడాది ఏకంగా జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు సైతం అందుకున్న సంగ‌తి తెలిసిందే. చిన్న వ‌య‌సులోనే ఉత్త‌మ న‌టిగానూ కీర్తిని సొంతం చేసుకున్న ఏకైక న‌టిగా రికార్డు సృష్టించింది. హాలీవుడ్ లో సైతం ఇదే ఏడాది లాంచ్ అయి అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. ఇలా ర‌ణ‌బీర్-అలియా భార్య భ‌ర్త‌లైన త‌ర్వాత వారిద్ద‌రి కెరీర్ కి ఎంతో క‌లిసొచ్చింద‌ని చెప్పాలి.

ఇక పెళ్లైనా ఏడాది న‌వంబ‌ర్ లోనే ఈ జంట‌కు పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. ఆపాపాయికి రెహ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. రెహ ఫోటోలు ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. పుట్టిన వెంట‌నే రోజుల బేబిని మాత్రం అలియా అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఆ త‌ర్వాత ఎలాంటి ఫోటో బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ జోడీ క్రిస్మ‌స్ ని పుర‌స్క‌రించుకుని కుమార్తె ర‌హ‌ని మీడియా ముందుకు తీసుకొచ్చారు.

ఇద్ద‌రు కుమార్తెను తీసుకుని ఇంట్లోచి బ‌య‌ట‌కు వ‌చ్చి కెమెరాకి ఫోజులిచ్చారు. ఆ స‌మ‌యంలో రెహ‌ని మీడియా కి చూపించారు. రెహ‌ని కింద‌కి దించ‌బోతుంటే? నాన్న కాళ్ల మీద‌కి పాకేస్తుంది. పాపాయి నాన్న కూచీ అనుకుంటా. రెహ ఎంతో ముద్దుగా ఉంది క‌దూ.