కపూర్ వంశపు ప్రిన్సెస్ కోసం 250కోట్ల భవంతి రెడీ
రణబీర్- ఆలియా జంటకు ఇది వారసత్వ సంపదగా వచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరూ కుమార్తె రాహా కపూర్ కి బదలాయిస్తున్నారు.
By: Tupaki Desk | 9 Jun 2025 11:07 PM ISTకొందరిని మహర్జాతకులు అంటారు! ఇలా పుట్టగానే అలా కోట్లు కలిసొస్తాయి. వందల, వేల కోట్లకు ఆస్తిపరులు అవుతుంటారు. అలాంటి మహర్జాతకురాలు రాహా కపూర్. కపూర్ వంశపు రాకుమారి రాహా కపూర్ ఇలా భూమ్మీద పడిందో లేదో అలా 250 కోట్ల ఖరీదైన భవంతిని కపూర్ లు రాసిచ్చేస్తున్నామని ప్రకటించారు. ఇది తమ ఇంటి అపురూపమైన బిడ్డకు అరుదైన కానుక అంటూ రణబీర్ కపూర్- ఆలియా భట్ జంట ఘనంగా ప్రకటించారు. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. కపూర్ హీరోల అభిమానులు ఆనందంతో పరవశించారు.
ఇది వారసత్వపు ఆస్తి. రాజ్ కపూర్ కి చెందిన ఆస్తి. అక్కడ అందమైన భవంతి నిర్మాణం పూర్తవుతోంది.సంవత్సరాల తరబడి ఎదురుచూపులు, గొప్ప ప్రణాళికలతో రణబీర్ కపూర్- అలియా భట్ చివరకు తమ కలల ఇంటిని నిర్మించుకుంటున్నారు. రణబీర్ దివంగత అమ్మమ్మ కృష్ణ రాజ్ కపూర్ పేరుతో నిర్మిస్తున్న ఈ సంపన్నమైన ఆరు అంతస్తుల బంగ్లా నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రణబీర్- ఆలియా జంటకు ఇది వారసత్వ సంపదగా వచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరూ కుమార్తె రాహా కపూర్ కి బదలాయిస్తున్నారు. తమ కుమార్తె రాహా- రణబీర్ తల్లి నీతు కపూర్‌తో కలిసి రెగ్యులర్ గా ఈ ఇంటికి విజిట్ చేసిన వీడియోలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. ఇది బాంద్రా లో అత్యంత విలాసవంతమైన ఆస్తులలో ఒకటి. సాధ్యమైనంత తొందర్లోనే గృహప్రవేశం జరగనుందని చెబుతున్నారు.
ఈ ప్రాపర్టీ కపూర్ కుటుంబ చరిత్రలో ఒక భాగం. ఆ కుటుంబంలో గత తరాలకు నివాళి. కపూర్ ల భవిష్యత్ కి సాక్ష్యంగాను నిలుస్తుంది. లెజెండ్స్ రాజ్ కపూర్ - కృష్ణ రాజ్ కపూర్ లు 1980లలో రిషి కపూర్ -నీతు కపూర్‌లకు ఒక పాత భవంతితో ఈ ఆస్తిని వారసత్వంగా అందించారు. రణబీర్ - ఆలియా ఇప్పుడు ఆ పాత భవనం తొలగించి కత్త నిర్మాణం చేపట్టారు. వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.
కొత్త భవనం వారి కుమార్తె రాహా కపూర్ పేరు మీద రిజిస్టర్ అవుతోంది. రణబీర్ - అలియా ప్రేమ గూడు ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ గూటిలోకి మారేందుకు ప్రేమపక్షులు తమ బిడ్డతో వెయిట్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఆస్తి విలువను రూ. 250 కోట్లుగా అంచనా వేసారు. బంగ్లా నిర్మాణం దాదాపుగా పూర్తయింది. నిజానికి ఏడాది క్రితమే ఈ ఇంట్లో ప్రవేశిస్తారని ప్రచారం సాగినా కానీ నిర్మాణ పనుల జాప్యం కారణంగా కుదరలేదు. సాధ్యమైనంత తొందర్లోనే గృహ ప్రవేశం జరుగుతుందని ఆశిస్తున్నారు.
