Begin typing your search above and press return to search.

చాలా సంతోషం, ఆ ఒక్కటీ ఇవ్వాలి : రాఘవేంద్ర రావు

కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ స్మారక చిహ్నం ను ఆ విష్కరించిన నేపథ్యం లో దర్శకుడు రాఘవేంద్ర రావు స్పందించారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 8:43 AM GMT
చాలా సంతోషం, ఆ ఒక్కటీ ఇవ్వాలి : రాఘవేంద్ర రావు
X

మాజీ ముఖ్యమంత్రి, లెజెండ్రీ సినీ నటుడు దివంగత నందమూరి తారక రామారావు ను గౌరవిస్తూ భారత ప్రభుత్వం వంద రూపాయల నాణెం ను ఆవిష్కరించిన విషయం తెల్సిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీనియర్ ఎన్టీఆర్ స్మారక చిహ్నంగా నాణెం ను విడుదల చేయడం పట్ల నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ స్మారక చిహ్నం ను ఆ విష్కరించిన నేపథ్యం లో దర్శకుడు రాఘవేంద్ర రావు స్పందించారు. ప్రభుత్వం చేసిన పని తెలుగు ప్రజలకు సంతోషం కలిగిస్తుంది. తెలుగు వారు అంతా కూడా గర్వించే విషయం. గర్వం తో మనసు నిండిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అన్నారు.

ఈ ప్రతిష్టాత్మక గౌరవం ను అందించిన కేంద్ర ప్రభుత్వం సీనియర్‌ ఎన్టీఆర్ గారికి భారత రత్న అవార్డును కూడా ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని రాఘవేంద్ర రావు విజ్ఞప్తి చేశారు. రాఘవేంద్ర రావు ఒక వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఆయన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

నందమూరి అభిమానులతో పాటు పలువురు తెలుగు వారు సీనియర్ ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌ కి భారత రత్న అవార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ముందు ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నందమూరి ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.