Begin typing your search above and press return to search.

ల‌వ్ గివ్వు ఇదో త‌ల‌కాయ నొప్పి!

స్కూల్..కాలేజీ డేస్ ఎవ‌ర‌కైనా ప్ర‌త్యేక‌మే. ఆ నాటి అనుభ‌వాలు గుర్తు చేసుకుంటే? ఎన్నో తీపిచేదు జ్ఞాప‌కా లుంటాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2023 2:30 PM GMT
ల‌వ్ గివ్వు ఇదో త‌ల‌కాయ నొప్పి!
X

స్కూల్..కాలేజీ డేస్ ఎవ‌ర‌కైనా ప్ర‌త్యేక‌మే. ఆ నాటి అనుభ‌వాలు గుర్తు చేసుకుంటే? ఎన్నో తీపిచేదు జ్ఞాప‌కా లుంటాయి. ఇప్ప‌టి రోజుల‌క‌న్నా అప్ప‌టి రోజులు..అప్ప‌టి బాల్య‌మే ఎంతో బాగుంది అనిపిస్తుంది. టెక్నాల‌జీ పెర‌గ‌డంతో దాంతో పాటు మ‌నిషి జీవితం మారింది. కానీ ప్ర‌శాంత‌త కొర‌వ‌డింది అన్న‌ది వాస్తవం. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఆ నాటి..ఆయ‌న కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.


'నా కాలేజ్ రోజులన్నీ చెన్నైలో గడిచాయి. అప్పట్లో ఫోన్లు లేవు. యూత్ ఇంత ఫాస్టుగానూ..పోష్ గాను ఉండేది కాదు. అప్పట్లో ప్రేమలోపడితే లేఖ‌లు రాయ‌డం జ‌రిగేది. ఆ లెటర్ ఆమెకి చేరిందో లేదో చూసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్. ర‌క‌ర‌కాల టెన్ష‌న్ లు వెంటాడేవి. అందుకే ఈ త‌ల‌కాయ నొప్పి వ్య‌వ‌హారం మ‌న‌కి స‌రిప‌డ‌ద‌ని ఏనాటు ప్రేమ జోలికి వెళ్ల‌లేదు. ఇవ‌న్నీ నాకెందుకు అనుకునే వాడిని.

ఇష్టమైన వాళ్లు కనిపిస్తే మాట్లాడేవాడిని. స్నేహితులతో కలిసి పిట్టగోడలపై కూర్చునేవాడిని. అటుగా రోడ్ల మీద వెళ్తోన్న అమ్మాయిల్ని చూసేవాడిని. అంత‌కు మించి నా లైఫ్ లో ఇంకేమీ లేదు. ఎవ‌రితోనూ ఎఫైర్ లేదు. పెళ్లి అంటే అప్ప‌ట్లో కేవ‌లం పెద్ద‌ల కుదిర్చిన పెళ్లిళ్లు ఎక్కువ‌గా జరిగేవి. ప్రేమ వివాహాలు ఎక్క‌డో కానీ వినే వాళ్లం కాదు. అందువలన విడిపోవడమనే సంఘటనలు చాలా తక్కువగా జరిగేవి.

ఇప్పుడు జ‌న‌రేష‌న్ చాలా ఛేంజ్ అయింది. అప్ప‌టికీ..ఇప్ప‌టికీ అస‌లు పోలిక గానీ..పొంత‌న‌గానీ ఏమాత్రం లేదు. ఇప్పుడు పెళ్లి బంధాలు బాగా బ‌ల‌హీన‌మైపోయాయి. చిన్న చిన్న కార‌ణాల‌తో విడిపోతున్నారు. అవి చూసి నాకు చాలా బాధ‌గా అనిపిస్తుంది. వివాహ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. రెండు కుటుంబాలు...భ‌విష్య‌త్ కి బాట‌లు వేసేది పెళ్లి. అలాంటి బంధాలు ఇప్పుడు చిన్న కారణాల‌కే విచ్చిన్నం అయిపోతున్నాయి. కోట్ల రూపాయ‌ల‌తో పెళ్లి ఎంతో వైభ‌వంగా చేసుకుంటున్నారు. కానీ ఏడాది తిరిగే స‌రికి విడిపోతున్నారు. ఈ విధానం మారాలి. మార్పులు రావాల‌ని కోరుకుంటున్నాను` అని అన్నారు.