అడవిరాముడు సినిమాపై రాఘవేంద్ర రావు క్లారిటీ
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటూ ఆ ప్రచారాలపై కూడా మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 5 May 2025 3:49 PMటాలీవుడ్ సీనియర్ డైరెక్టర్లలో రాఘవేంద్ర రావు మరింత ప్రత్యేకమనే విషయం తెలిసిందే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అడవి రాముడు సినిమా స్పెషల్ గా నిలిచిపోతుందనే సంగతి తెలిసిందే. 1977లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అడివి రాముడు హిట్ ఎన్టీఆర్ కెరీర్ తో పాటూ డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు కెరీర్ కు కూడా ఎంతో ఉపయోగపడింది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు శోభన్ బాబు ను అనుకున్నారని, కానీ తర్వాత అది ఎన్టీఆర్ చేశారని అప్పట్లో బాగా వార్తలొచ్చాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటూ ఆ ప్రచారాలపై కూడా మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.
అడవి రాముడు సినిమా చేద్దామనుకున్నప్పటి నుంచి హీరోగా ఎన్టీఆర్‌నే అనుకున్నామని, ఆ సినిమా గురించి వచ్చిన ప్రచారాలన్నీ అబద్ధాలని, కాకపోతే అడవి రాముడు సినిమా కథను లైన్ గా అనుకున్న టైమ్ లో శోభన్ బాబు కు కూడా ఈ కథ సెట్ అవుతుందని అనుకున్నామని, కానీ నిర్మాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నామని చెప్పారని రాఘవేంద్ర రావు తెలిపారు.
డైరెక్టర్ గా మీ పేరు చెప్పగానే ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పారని నిర్మాత తనతో చెప్పడం వల్ల వెంటనే తన దగ్గర ఉన్న అడవి రాముడు లైన్ ను డెవలప్ చేశామని రాఘవేంద్ర రావు తెలిపారు. అలా అనుకోకుండా చేసిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అడవి రాముడు సినిమా 4 సెంటర్లలో సంవత్సరం పాటూ ఆడగా, 8 సెంటర్లలో 200 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ఆడింది. నెల్లూరు కనకమహల్ థియేటర్లో ప్రతీ రోజూ 5 ఆటలతో పాటూ 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది ఆ సినిమా.