Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ ఆ హీరో కోసం రంగంలోకి!

రాఘ‌వ లారెన్స్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాలమ‌వుతోంది. `ముని-3` త‌ర్వాత హిట్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

By:  Tupaki Desk   |   15 April 2024 10:30 AM GMT
స్టార్ డైరెక్ట‌ర్ ఆ హీరో కోసం రంగంలోకి!
X

రాఘ‌వ లారెన్స్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాలమ‌వుతోంది. `ముని-3` త‌ర్వాత హిట్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. `రుద్ర‌న్`..`చంద్ర‌ముఖి-2` భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద బొల్తా కొట్టిన చిత్రాలే. అటుపై రిలీజ్ అయిన `జిగ‌ర్తాండ్ డ‌బుల్ ఎక్స్ ఎల్` కోలీవుడ్ లో మంచి వ‌సూళ్లు సాధించినా! తెలుగు ఆడియ‌న్స్ కి మాత్రం క‌నెక్ట్ అవ్వ‌లేదు. దీంతో స‌రైన రిలీజ్ కోసం లారెన్స్ వెయిట్ చేస్తున్నాడు. త‌మిళ్ లో ఓ రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అవి కూడా హోల్డ్ లో ప‌డిన‌ట్లు మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా లారెన్స్ కోసం ఏకంగా పాన్ ఇండియా సంచ‌ల‌నం లొకేష్ క‌న‌గ‌రాజ్ రంగంలోకి దిగాడు. అత‌డి కోసం ఓ స్టోరీని అందించాడు. ఆ సినిమా టైటిల్ `బెంజ్`. ఈ క‌థ‌ని లారెన్స్ కోస‌మే ప్ర‌త్యేకంగా రాసాడుట‌. అయితే ద‌ర్శ‌కుడిగా మాత్రం లోకేష్ ఛాన్స్ తీసుకోలేదు. ఆ బాధ్య‌త‌లు `రెమో` ఫేం భాగ్య‌రాజ్ క‌న్న‌న్ కి అప్ప‌గించారు. ఈ క‌థ‌ని ఎప్ప‌టి నుంచో తెర‌కెక్కించాల‌ని లోకేష్ అనుకుంటున్న‌ట్లు తెలిపాడు. త‌న‌కిష్ట‌మైన క‌థ‌లో అంత‌కంటే ఇష్ట‌మైన న‌టుడు న‌టిస్తే? అంత‌కు మించి ఆనందం త‌న‌కేముంటుంద‌ని సోష‌ల్ మీడియా వేదికగా సంతోషం వ్య‌క్తం చేసాడు.

అయితే ఇది లోకేష్ మార్క్ స్టోరీనా? లేక లారెన్స్ కోసం కొత్త‌గా రాసాడా? అన్న‌ది తెలియాలి. లోకేష్ స్టోరీలు ఎలా ఉంటాయి? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.మార్కెట్ లో త‌న‌కంటూ ఓ యూనివ‌ర్శ్ ని క్రియేట్ చేసుకున్నాడు. `ఖైదీ`..`.విక్ర‌మ్` సినిమాలో అది ప్రూవ్ అయింది. ఇదే యూనివ‌ర్శ్ నుంచి ర‌క‌ర‌కాల సినిమాలొస్తాయని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. మ‌రి త‌న క‌థ‌తో లారెన్స్ ని విక్ర‌మ్ యూనివ‌ర్శ్ లోకి తీసుకొస్తున్నాడా? లేక యూనివ‌ర్శ్ తో సంబంధం లేకుండా ప్ర‌త్యేకంగా సిద్దం చేసిన స్టోరీనా? అన్న‌ది తెలియాలి.

ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 171వ చిత్రం ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ర‌జ‌నీ ఈ చిత్రంతో ఎంతో ఇష్ట‌ప‌డి డైరెక్ట్ చేస్తున్నాడు. త‌న అభిమాన‌మంతా ఈ సినిమాలో క‌నిపిస్తుంద‌ని ఇప్ప‌టికే రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే.