Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కాళ్ళు మొక్కిన లారెన్స్

ఈ సీక్వెన్స్ మూవీలో అప్పుడు, రజినీకాంత్ నటించిన పాత్రలో ఇప్పుడు లారెన్స్ నటిస్తున్నారు. అప్పుడు చంద్రముఖిగా జ్యోతిక భయపెట్టింది

By:  Tupaki Desk   |   26 Sep 2023 6:59 AM GMT
స్టార్ హీరో కాళ్ళు మొక్కిన లారెన్స్
X

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా, దాదాపు 17ఏళ్ల క్రితం వచ్చిన సినిమా చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం. ఈ మూవీ విడుదలకు దగ్గరైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసింది.


మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల అవుతుండటంతో, లారెన్స్ , రజినీకాంత్ ని కలిశారు. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రీసెంట్ గా రజినీకాంత్ జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు లారెన్స్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అదేవిధంగా, తాను చంద్రమూవీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యానని, అందుకే, రజినీకాంత్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నానని చెప్పాడు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక, ఈ చంద్రముఖి 2 విషయానికి వస్తే, తాజాగా ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. కంగరనౌత్, లారెన్స్ హైదరాబాద్ వచ్చి, ఇక్కడ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనడం విశేషం.

ఈ సీక్వెన్స్ మూవీలో అప్పుడు, రజినీకాంత్ నటించిన పాత్రలో ఇప్పుడు లారెన్స్ నటిస్తున్నారు. అప్పుడు చంద్రముఖిగా జ్యోతిక భయపెట్టింది. ఇప్పుడు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ భయపెట్టడానికి రెడీ అయ్యింది. నిజానికి ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సింది. కానీ, మేకర్స్ మూవీ విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు, ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఈ సినిమాను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఈ సినిమాకి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్‌ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. .ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.