Begin typing your search above and press return to search.

లారెన్స్ మాస్టార్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా?

కరోనావైరస్ మహమ్మారి సమయంలో రాఘవ లారెన్స్ కోలీవుడ్ తో పాటు చెన్నై ప్రజలలో భారీ సహాయం చేసి వార్తల్లో నిలిచాడు

By:  Tupaki Desk   |   9 Sep 2023 11:27 AM GMT
లారెన్స్ మాస్టార్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా?
X

రాఘ‌వ లారెన్స్ గురించి వ‌ర్ణించాలంటే విశేష‌ణాలు చాల‌వు. కొరియోగ్రాఫ‌ర్ -న‌టుడు- ద‌ర్శ‌కుడు- సంగీత ద‌ర్శ‌కుడు .. 24 శాఖ‌ల‌పై ప‌ట్టున్న‌వాడు.. సామాజిక క‌ర్త‌.. ఆల్ రౌండ‌ర్.. ఇలా ఎన్ని కోణాల్లో అయినా చెప్పొచ్చు. కానీ లారెన్స్ గురించి తెలిసిన‌న్ని విష‌యాలు అత‌డి కుటుంబం గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. ముఖ్యంగా అత‌డికి ఈడొచ్చిన కుమార్తె, టీనేజీ కుమారుడు ఉన్నార‌ని తెలిసింది త‌క్కువ మందికే. ముఖ్యంగా లారెన్స్ కుమారుడు ప‌లు ఈవెంట్ల‌లో క‌నిపించినా కానీ కుమార్తె ఉంద‌ని మాత్రం ఎవ‌రికీ తెలీదు. అంతగా లో-ప్రొఫైల్ లో గ్లామ్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచానికి దూరంగా త‌న కుటుంబాన్ని ఉంచాడు అత‌డు.

కరోనావైరస్ మహమ్మారి సమయంలో రాఘవ లారెన్స్ కోలీవుడ్ తో పాటు చెన్నై ప్రజలలో భారీ సహాయం చేసి వార్తల్లో నిలిచాడు. ముఖ్యమంత్రి నిధి, ప్రధానమంత్రి నిధి, FEFSI వర్కర్స్ యూనియన్, రోయపురం ప్రజలు, ట్రాన్స్‌జెండర్లు, డ్యాన్సర్స్ యూనియన్ ఇలా అనేక వ‌ర్గాల‌కు ఐదు కోట్లు పైగా విరాళాలు అందించాడు లారెన్స్‌. ఇక అత‌డు ద‌శాబ్ధం పైగానే చారిట‌బుల్ ట్ర‌స్ట్ ని నిర్వ‌హిస్తున్నాడు. త‌ద్వారా పేద పిల్ల‌ల‌కు అనాధ‌ల‌కు ఉచితంగా విద్య‌ను అందిస్తున్నాడు. ఇక ప్ర‌కృతి వైప‌రీత్యాల వేళ చిరంజీవిలా ఉదారంగా దానం చేయ‌డంలో లారెన్స్ ప్ర‌సిద్ధి చెందాడు. ఇటీవ‌ల లారెన్స్ సోద‌రుడు కూడా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడ‌ని ప్ర‌చారం ఉంది. దాని గురించిన మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

రాఘవ లారెన్స్ తన తల్లి, సోదరుడికి సంబంధించిన ఫోటోల‌ను చాలాసార్లు సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసినా కానీ, తన జీవిత భాగస్వామి, పిల్లలకు సంబంధించిన ఫోటోలేవీ షేర్ చేయ‌లేదు. గ‌తంలో తాను నిర్వ‌హిస్తున్న‌ అనాథాశ్రమానికి చెందిన పిల్లలతో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి ఆ స‌మ‌యంలో త‌న కుమార్తె గురించి అత‌డు మాట్లాడాడు. ''హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్, నాకు రాఘవి అనే ఒకే ఒక కుమార్తె ఉంది. కానీ దేవుడు నన్ను చాలా మంది పిల్లలతో ఆశీర్వదించాడు. నేను ఈ పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఎలాంటి నేపథ్యం ఉన్నా కానీ ఈరోజు నాకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉంది'' అని లారెన్స్ అన్నాడు. నిజానికి లారెన్స్ త‌న కుటుంబాన్ని ప‌రిచ‌యం చేయ‌డం కంటే అనాధ‌ల‌తో స‌మ‌యం గ‌డప‌డం, వారికి చేత‌నైనంత‌ స‌హ‌క‌రించ‌డం మాత్ర‌మే తెలుసు అంటే అతిశ‌యోక్తి కాదు.

ఇక లారెన్స్ కుమార్తె రాఘ‌వి ఇప్ప‌టికే టీనేజీలో అడుగుపెట్టింది. జీన్స్ టీస్ ధ‌రించి ఎంతో ట్రెండీగా క‌నిపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వెబ్ లో షికార్ చేస్తున్నాయి. ఈ ఫోటోల‌ను వీక్షించిన అభిమానులు లారెన్స్ కి ఇంత పెద్ద కుమార్తె ఉందా? అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే రాఘ‌వి కూడా తండ్రిలా న‌ట‌న‌లోకి వ‌స్తుంది! అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. రాఘ‌వి ట్రెండీ లుక్స్ కి సంబంధించిన ఫోటోల‌ను కూడా వైర‌ల్ చేస్తున్నారు. లారెన్స్ గొప్ప కొరియోగ్రాఫ‌ర్ కం న‌టుడిగా ఎదిగాడు. ద‌ర్శ‌కుడిగాను నిరూపించాడు. రాఘ‌వి కూడా తండ్రి బాట‌లోనే వెళుతుందేమో చూడాలి. లారెన్స్ ప్ర‌స్తుతం సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'చంద్రముఖి 2'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పి. వాసు దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా లారెన్స్ తో పాటు ఇందులో క్వీన్ కంగ‌న న‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.