కిల్ కిల్లర్.. డిమాండ్ మామూలుగా లేదు!
ఈ సినిమాతో రాఘవ జుయాల్‌కి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. డ్యాన్సర్, హోస్ట్‌గా పేరు సంపాదించిన ఈ యువ నటుడు ఇప్పుడు నటుడిగా తనదైన స్థానం ఏర్పరుచుకుంటున్నాడు.
By: Tupaki Desk | 11 July 2025 5:11 PM IST2023లో వచ్చిన ‘కిల్’ అనే సినిమా చూసిన వారు అందులో విలన్ పాత్ర చేసిన నటుడిని అంత ఈజీగా మర్చిపోలేరు. రాఘవ జుయాల్ అనే నటుడు సినిమాలో సైకో కిల్లర్ లా కనిపించి స్టన్ అయ్యేలా కనిపించాడు. ఆ హావభావాలు, ఫెరాసిటీ, అసలైన నేరస్తుడిలా కనిపించడంతోనే అతడి నటనపై ఇండస్ట్రీ అంతా ఫోకస్ పెట్టింది. కామెడీతో మొదలైన ఆయన కెరీర్‌కి ఇప్పుడు టర్నింగ్ పాయింట్ గా ‘కిల్’ నిలిచింది.
ఈ సినిమాతో రాఘవ జుయాల్‌కి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. డ్యాన్సర్, హోస్ట్‌గా పేరు సంపాదించిన ఈ యువ నటుడు ఇప్పుడు నటుడిగా తనదైన స్థానం ఏర్పరుచుకుంటున్నాడు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లలో నటించి నటన పరంగా మెప్పించిన రాఘవ.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఒకపక్క బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమాలో కీలక పాత్రను చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’లోనూ నటిస్తున్నాడు.
అందరికీ షాక్ ఇచ్చేలా, ‘ది ప్యారడైజ్’ బృందం రాఘవ జుయాల్ ను స్పెషల్ బర్త్ డే పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించింది. నాని శ్రీకాంత్ ఒదెలా కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ లో రాఘవ కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్, ఇప్పుడు నానికి మరో మాస్ రోల్ ఇవ్వబోతున్నాడని టాక్. అలాంటి సినిమాలో రాఘవకు అంత స్పేస్ రావడం అంటే అతడి విలన్ రేంజ్ ఏ లెవెల్లో ఉందొ అర్థమవుతోంది.
ఇక షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాలోనూ ఆయన పాత్ర ప్రాముఖ్యం చాలా ఉందట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ లో రాఘవకు ప్రత్యేకమైన ఎలివేషన్ సీన్స్ ఉంటాయట. దీంతో వరుసగా రెండు బిగ్ ప్రాజెక్ట్స్‌లో అవకాశం రావడంతో రాఘవ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందట. ‘కిల్’కి ముందు లక్షల్లో తీసుకున్న ఫీజు.. ఇప్పుడు కోట్లు దాటినట్టు సమాచారం. ఇప్పటికే పాన్ ఇండియా విలన్‌గా అతడిని లైన్‌లో పెట్టినట్టు ఫిలిం నగర్ టాక్.
ఒకప్పుడు కామెడీ టచ్‌తో స్క్రీన్‌పై కనిపించిన ఈ యువకుడు.. ఇప్పుడు మాస్ సినిమాల్లో క్రూరమైన, అఘోరమైన విలన్ పాత్రల్లో తళుక్కున మెరిసేలా మారిపోతున్నాడు. ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు కొత్త డైమెన్షన్ రావాలంటే, రాఘవ లాంటి నటులు తప్పనిసరిగా అవసరం. మరి షారుఖ్ ఖాన్, నాని సినిమాలతో అతడి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.
