Begin typing your search above and press return to search.

ది ప్యారడైజ్.. ఇంకో పవర్ఫుల్ రోల్ ఇదే!

ఇప్పటికే విడుదలైన ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు నటుడు రాఘవ జూయల్ బర్త్‌డే సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   10 July 2025 2:26 PM IST
ది ప్యారడైజ్.. ఇంకో పవర్ఫుల్ రోల్ ఇదే!
X

‘దసరా’తో నేషనల్ లెవెల్‌లో పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హైప్ క్రియేట్ చేస్తోన్న ప్రాజెక్ట్. నాని ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రూపొందించేందుకు బిగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్లడమే కాదు.. వారం వారం ఏదో ఒక క్రేజీ అప్‌డేట్ ఇస్తూ సినిమా మీద ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు నటుడు రాఘవ జూయల్ బర్త్‌డే సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో రాఘవ పాత్రను ఎలా డిజైన్ చేశారో, ఆయన లుక్స్ ఎలా ఉంటాయో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్వయంగా హైలెట్ చేశారు. పాత్రకి ఉన్న బ్రూటల్ షేడ్స్, విలక్షణమైన ఒవర్‌టోన్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాఘవ కూడా ఆ క్యారెక్టర్ గురించి వివరాలు వింటూ ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు కనిపించారు. ‘కిల్’ సినిమాల్లో తన డిఫరెంట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న రాఘవ జూయల్.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్ లో పాన్ ఇండియా రేంజ్‌లో మరో బ్రేక్ తీసుకోనున్నారు. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలో కూడా ఆయన కీలక పాత్రలో నటిస్తున్నట్లు బజ్ ఉంది.

ఇప్పుడు నాని వంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా కోసం ఇప్పటికే హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వీటిపై త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని మేకర్స్ తెలిపారు. ‘ది ప్యారడైజ్’ 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా రీలీజ్ అవుతుండటంతో ఇది పాన్-వరల్డ్ సినిమా అనే ట్యాగ్‌తో ముందుకెళ్తోంది.

నానిని మరో లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉన్న ఈ సినిమాలో టెక్నికల్ టీమ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫర్ గా చై సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి అందిస్తున్నారు. ఇక SLV సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మొత్తానికి 'ది ప్యారడైజ్' లుక్, కాస్టింగ్, మేకింగ్ అప్‌డేట్స్ చూస్తుంటే ఇది పక్కా ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ అవుతుందని తెలుస్తోంది. ఇప్పుడు రాఘవ జూయల్ ఎంట్రీతో మరింత ఇంటెన్సిటీ పెరిగింది. ఇక మిగతా క్యాస్ట్, స్టొరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయో చూడాలి.