Begin typing your search above and press return to search.

#Mega157 టైటిల్ ఫిక్స్ చేసినట్టేనా?

దీని ఎండింగ్‌లో 'రఫ్ఫాడించేద్దాం' అనే డైలాగ్‌ని వాడారు. ఆ త‌రువాత న‌య‌న‌తార ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట‌ర‌వుతున్నారంటూ మ‌రో వీడియోని అనిల్ రావిపూడి వ‌దిలాడు.

By:  Tupaki Desk   |   21 May 2025 6:17 AM
#Mega157 టైటిల్ ఫిక్స్ చేసినట్టేనా?
X

స‌ర‌దా టైటిల్‌తో ఈ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంక‌టేష్‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, మీనాక్షీ చౌద‌రి హీరో హీరోయిన్‌లుగా న‌టించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఫక్రైమ్ ఎలిమెంట్‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని జోడించి అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురి చేసింది.

ఓ మోస్తారు ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రూ.250 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి వెంకీ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. సింపుల్ స్టోరీతో అనిల్ అద్భుతం చేయ‌డంతో అత‌నిపై మెగాస్టార్ క‌న్నుప‌డ‌టం, త‌న‌కు సినిమా ఇవ్వ‌డం తెలిసిందే. Mega157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో చిరుకు జోడీగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి త‌నదైన మార్కు ప‌బ్లిప‌సిటీతో వీడియోలు వ‌దులుతున్నాడు అనిల్ రావిపూడి.

అ ప్రాజెక్ట్ ప్ర‌క‌టిస్తూ ముందుగా ఓ వీడియోని విడుద‌ల చేశారు. దీని ఎండింగ్‌లో 'రఫ్ఫాడించేద్దాం' అనే డైలాగ్‌ని వాడారు. ఆ త‌రువాత న‌య‌న‌తార ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట‌ర‌వుతున్నారంటూ మ‌రో వీడియోని అనిల్ రావిపూడి వ‌దిలాడు. దీనిలోనూ వీడియో ఎండింగ్‌లో 'రఫ్ఫాడించేద్దాం' అనే డైలాగ్ వాడ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 'సంక్రాంతికి వ‌స్తున్నాం' టైటిల్‌ని కూడా ఇలాగే వాడేసి చివ‌రికి ఇదే టైటిల్‌ని ఫైన‌ల్ చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు Mega157 కోసం 'రఫ్ఫాడించేద్దాం' డైలాగ్‌ని వాడేస్తూ టైటిల్ హింట్ ఇచ్చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

'గ్యాంగ్‌లీడ‌ర్‌'లో చిరు వాడే ఊత‌ప‌దం 'ర‌ఫ్పాడించేద్దాం'. దీన్నే ఈ మూవీకి టైటిల్‌గా ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉంద‌ని, అందులో భాగంగానే ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి అనిల్ రావిపూడి ఈ ప‌దాన్ని ప‌దే ప‌దే వాడేస్తూ జ‌నాల్లో రిజిస్ట‌ర్ అయ్యేలా ప్లాన్ చేశాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదే నిజ‌మైతే చిరు, అనిల్ రావిపూడి వ‌చ్చే సంక్రాంతికి ర‌ఫ్పాడించేయ‌డం ఖాయం.