Begin typing your search above and press return to search.

కొత్త ప్రయాణం మొదలైంది : రాధిక

హీరోయిన్ గా కెరీర్‌ ముగిసిన వెంటనే తన ఇమేజ్ కు తగ్గట్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ లో ముందుకు వెళ్లింది

By:  Tupaki Desk   |   25 Oct 2023 9:16 AM GMT
కొత్త ప్రయాణం మొదలైంది : రాధిక
X

1978 లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సినిమా తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన రాధిక దాదాపుగా అయిదు దశాబ్దాల సినీ కెరీర్‌ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా కంటిన్యూగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. హీరోయిన్ గా సినిమాలు చేసిన సమయంలో ఆమె కు ఆ భాష, ఈ భాష అనే బేధం లేకుండా వరుసగా అన్ని భాషల నుంచి సినిమా ఆఫర్లు వచ్చేవి.

హీరోయిన్ గా కెరీర్‌ ముగిసిన వెంటనే తన ఇమేజ్ కు తగ్గట్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ లో ముందుకు వెళ్లింది. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్ లో రాధిక పోషించిన పాత్రలు, ఆమె చేసిన సినిమాలు ఈతరం ప్రేక్షకులకు కూడా ఆమెను చేరువ చేశాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు రాధిక కెరీర్‌ లో కొత్త జర్నీ మొదలైంది.

తన కొత్త ప్రయాణం గురించి సోషల్‌ మీడియా ద్వారా ఆనందంగా చెబుతూ అందుకు సహకరించిన తన భర్తకు కృతజ్ఞతలు తెలియజేసింది. మొదటి సారి విదేశీ భాష సినిమాలో నటిస్తున్నట్లుగా రాధిక స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా పేర్కొంది. ఫ్రెంచ్ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది.

సోషల్ మీడియాలో రాధిక స్పందిస్తూ... నా సినీ జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్ సినిమాలో ఇప్పుడు నేను నటిస్తున్నాను. తొలి రోజు షూటింగ్‌ లో పాల్గొన్నాను. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది. తన జర్నీ ఇక్కడి వరకు రావడం లో సహకరించిన నా భర్త శరత్‌ కుమార్‌ కి కృతజ్ఞతలు. ఆయన ప్రోత్సాహంతోనే ఇక్కడి వరకు వచ్చానంటూ రాధిక పేర్కొంది.