Begin typing your search above and press return to search.

టిల్లు గాడి మరో రాధిక.. సౌండ్ షురూ!

రాధిక.. అనే పాటకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. అందులో ఫారిన్ పాపలతో సిద్దు డ్యాన్స్ వేస్తూ అనుపమ అందాన్ని పొగిడేస్తూ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 1:26 PM GMT
టిల్లు గాడి మరో రాధిక.. సౌండ్ షురూ!
X

యంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన DJ టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో సిద్దు డైలాగ్ టైమింగ్ క్లిక్ కావడంతో కలెక్షన్స్ తో మోత మోగించింది. అయితే మళ్లీ ఆ సినిమా తరహాలోనే బాక్స్ ఆఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ తో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు సిద్దు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.


ఇక ఈ సినిమాకు సంబంధించిన. ప్రమోషన్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ మరొక మేజర్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. రాధిక.. అనే పాటకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. అందులో ఫారిన్ పాపలతో సిద్దు డ్యాన్స్ వేస్తూ అనుపమ అందాన్ని పొగిడేస్తూ ఉన్నాడు. ఈ రాధిక రింగుల జుట్టుకు పడిపోయాను అంటూ అతను మాస్ సౌండ్ తో వివరించే ప్రయత్నం చేశాడు.

ఇక రామ్ మిర్యాల కంపోజ్ చేసి ఈ పాటను పాడాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. ఇక ఫుల్ వీడియో సాంగ్ ను నవంబర్ 27న సాయంత్రం 4.05 కు విడుదల చేయబోతున్నారు. ఇక టిల్లు స్క్వేర్ సినిమాను ఈ ఏడాదిలోని విడుదల చేయాలని అనుకున్నారు. డిసెంబర్లో ఓ డేట్ కూడా అనుకున్నారు. కానీ సినిమాల మధ్య పోటీ అనవసరం అని డేట్ మార్చుకున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన సినిమాను గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చారు. సితార అనుబంధ సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్ లోనే గుంటూరు కారం సంక్రాంతికి రానుంది. అందుకే జనవరిలో ఈ క్లాష్ మధ్యలో కంటెంట్ ఫేడ్ అవుట్ అయిపోకూడదు అని మేకర్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

ఇక సినిమాలో నేహ శెట్టి కూడా ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ తో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు శ్రీకరం స్టూడియోస్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ నిర్మిస్తున్నాయి.