Begin typing your search above and press return to search.

ఇరుక్కుపోయాను..టాయిలెట్ కూడా పోలేక‌పోతున్నా!

న‌టి రాధికా ఆప్టే విమాన‌శ్ర‌యంలోని ఏరోబ్రిడ్జ్ లో ఇరుక్కుపోయింది. అక్క‌డ కులాసాగా కూర్చుని..కింద మీద ప‌డుతూ ఉన్న ఓ వీడియోని అమ్మ‌డు స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 9:46 AM GMT
ఇరుక్కుపోయాను..టాయిలెట్ కూడా పోలేక‌పోతున్నా!
X

న‌టి రాధికా ఆప్టే విమాన‌శ్ర‌యంలోని ఏరోబ్రిడ్జ్ లో ఇరుక్కుపోయింది. అక్క‌డ కులాసాగా కూర్చుని..కింద మీద ప‌డుతూ ఉన్న ఓ వీడియోని అమ్మ‌డు స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. విమానం ఆల‌స్య‌మైంది. మ‌మ్మ‌ల్ని ఏరో బ్రిడ్జ్ లో లాక్ చేసారు. కొందరు ప‌సి పిల్ల‌ల‌తో ఉన్నారు. ఇక్క‌డ నీళ్లు.. టాయిలెట్లు కూడా అందుబాటులో లేవు. సెక్యురిటీ డోర్స్ ఓపెన్ చేయ‌డం లేదు' అని త‌న ఆవేద‌నని ఓ పోస్ట్ లో రాసుకొచ్చింది.

అయితే ఏ ఎయిర్ పోర్టులో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏ ప్లైట్ కోసం ఎదురు చూసి ఇలా ఇరుక్కుంది? అన్న వివ‌రాలు మాత్రం ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. అనుకోకుండా చోటు చేసుకున్న సంఘ ట‌న కావ‌డంతో ప్ర‌యాణికులంతా అసౌక‌ర్యానికి గుర‌వుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. నెట్టింట దానికి సంబంధించిన చిన్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతుంది.

ఈ వీడియోలో రాధికా ఆప్టే జీన్స్ ప్యాంట్...పైన ష‌ర్ట్ ధరించిన‌ట్లు తెలుస్తోంది. ముక్కు..మూతికి మాస్క్ ధ‌రించింది. కోవిడ్ కొత్త వేరియేంట్ కార‌ణంగా కోవిడ్ ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రాధికా ఆప్టే ప‌క్క‌నే మ‌రో ప్ర‌యాణికురాల్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక రాధిక కెరీర్ సంగ‌తి చూస్తే గ‌తేడాది 'అండ‌ర్ క‌వ‌ర్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం 'మేరి క్రిస్మ‌స్' లో న‌టిస్తోంది. ఈనెలలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో హీరోయిన్ గా క‌త్రినాకైఫ్ న‌టించింది. అలాగే ఇంగ్లీష్ లో 'సిస్ట‌మ్ మిడ్ నైట్' అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.ఈ ఏడాది రిలీజ్ కానుందీ సినిమా.